Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

లైన్లన్నీ బిజీ: రూట్ బర్త్ డేకి సెహ్వాగ్ ట్రేడ్ మార్క్ ట్వీట్

హైదరాబాద్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్‌లో తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రముఖులు, సెలబ్రిటీలు, మాజీ క్రికెటర్లు, ప్రస్తుత క్రికెటర్ల పుట్టినరోజులకు తనదైన శైలిలో శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తిని రేకెత్తిస్తున్నాడు.

ఫ్లాష్‌బ్యాక్ 2016: కోహ్లీనే బెస్ట్, టాప్ 5 టెస్టు బ్యాట్స్‌మెన్ వీరే

శుక్రవారం (డిసెంబర్ 30) ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జో రూట్ పుట్టినరోజుని పురస్కరించుకుని తన ట్రేడ్ మార్క్ స్టైల్‌లో సెహ్వాగ్ శుభాకాంక్షలు తెలిపాడు. శుక్రవారం జోరూట్ 26వ వసంతంలోకి ప్రవేశించాడు. అభిమానులు ముద్దుగా నవాబ్ ఆఫ్ నజఫ్‌గడ్‌గా పిలుచుకునే సెహ్వాగ్ జో రూట్‌కు విషెస్ తెలిపాడు.

ఈ ఏడాది జో రూట్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇంగ్లాండ్ టాప్ క్రికెటర్‌గా కొనసాగుతున్న జో రూట్ పరుగుల ఆకలితో బిజీగా ఉన్నాడంటూ సెహ్వాగ్ తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. 'హ్యాపీ బర్త్ డే జోరూట్. ఈ రూట్‌లో లైన్లన్నీ బిజీగా ఉన్నాయి. టాప్ ప్లేయర్, హంగ్రీ ప్లేయర్. అతని రూట్స్ తెలుసు' అంటూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.

Virender Sehwag greets Joe Root on his birthday, says 'all lines in this Root are busy'

జో రూట్ ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది 39 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన జో రూట్ 2567(టెస్టుల్లో 1477, వన్డేల్లో 796, టీ20ల్లో 297) పరుగులు సాధించాడు. జో రూట్ అత్యధిక స్కోరు 254. ఈ ఏడాది 17 టెస్టులాడిన జో రూట్‌ 1,477 పరుగులతో టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

ఇందులో మూడు సెంచరీలు, 10 అర్ధసెంచరీలు ఉన్నాయి. 2016లో జో రూట్ యావరేజి 49.23గా ఉంది. పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో జో రూట్ ఈ ఏడాది అత్యధిక పరుగులు (254) నమోదు చేశాడు. కోహ్లీలాగే ప్రస్తుత మోడ్రన్ క్రికెట్‌లో జో రూడ్ క్రీడా విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.

బెస్ట్ బ్యాట్స్‌మెన్ ఎవరు?: కోహ్లీ కాదు జో రూట్‌కే నా ఓటు

మరోవైపు ఇటీవల చెన్నైలో జరిగిన ఐదో టెస్టులో ఇంగ్లాండ్ తరపున ఒక ఏడాది అత్యధిక పరుగులు రికార్డును నెలకొల్పే అవకాశాన్ని తొలుత జో రూట్ తృటిలో కోల్పోయాడు. 2002లో ఇంగ్లాండ్ జట్టు తరపున టెస్టుల్లో ఒక క్యాలెండర్ అత్యధిక పరుగులు చేసిన రికార్డు మాజీ కెప్టెన్ మైకేల్ వాన్(1481) పేరిట ఉంది.

అయితే ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో జో రూట్ చెన్నై టెస్టులో ఆ రికార్డుకు పది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. మరోవైపు బెయిర్ స్టో 12 పరుగుల దూరంలో ఆ మైలురాయిని అందుకునే క్రమంలో పెవిలియన్‌కు చేరాడు. ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ ఎవరు? అనే డిబేట్‌లో కోహ్లి కంటే జో రూట్‌ అత్యుత్తమ క్రికెటరని స్టువర్ట్‌ బ్రాడ్‌ తెలిపాడు.

'కోహ్లి, జో రూట్‌, స్టీవ్‌ స్మిత్‌(ఆస్ట్రేలియా) ఈ ముగ్గురిలో ఎవరు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ అని నన్ను అడిగితే నా ఓటు జో రూట్‌కే. ఎందుకంటే అతనితో కలిసి నేను చాలా మ్యాచ్‌లు ఆడాను. ప్రతికూల పరిస్థితుల్లో కూడా పరుగులు రాబట్టడం ఎలాగో అతనికి బాగా తెలుసు' అని చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+