
హైదరాబాద్: టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ బుధవారం (ఏప్రిల్ 18)న 26వ పుట్టినరోజుని జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా సహచర ఆటగాళ్లు, అభిమానులు కేఎల్ రాహుల్‌కు సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్ 11వ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పంజాబ్ జట్టు మొహాలీలో ఉంది. సహచర ఆటగాళ్ల మధ్య రాహుల్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకొన్నాడు. యువరాజ్, గేల్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
కేఎల్ రాహుల్‌కు టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తనదైన స్టైల్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడు. 'మరో అమ్మ కడుపున పుట్టిన నా సోదరుడికి పుట్టిన రోజు శుభాకాంక్షలు' అంటూ ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. ఈ సీజన్‌లో కేఎల్ రాహుల్ ఓపెనర్‌గా పంజాబ్ జట్టు విజయాల్లో పాలుపంచుకుంటున్నాడు.
ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 14 బంతుల్లోనే 50 పరుగులు చేయడం ద్వారా ఐపీఎల్‌లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీని సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు.