గెలిచినా, ఓడినా పోరాటం చేయాలి.. అంతేకానీ తలొగ్గకూడదు! భారత్ పెద్ద జట్లతోనూ ఇలానే ఆడాలి: సెహ్వాగ్

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12లో ఎట్టకేలకు భారత్ బోణీ కొట్టిన విషయం తెలిసిందే. వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమిపాలై సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న భారత్.. బుధవారం బ్యాటింగ్, బౌలింగ్ సహా అన్ని రంగాల్లో రాణించి అఫ్గానిస్థాన్‌పై 66 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. దీంతో కోహ్లీసేన సెమీస్ ఆశలను ఇంకా సజీవంగా ఉంచుకోగలిగింది. భారత ప్రదర్శనపై ప్రస్తుతం ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా కోహ్లీ సేనను అభినందించాడు. అఫ్గాన్‌తో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా సభ్యుల్లో సానుకూల దృక్పథం, బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉందని కొనియాడాడు.

సెమీస్ చేరాలంటే:
టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ చేతిలో చిత్తయిన భారత్.. తర్వాత న్యూజిలాండ్‌పైనా ఓడిపోయింది. దీంతో సెమీస్ చేరాలంటే.. మిగిలిన మూడు మ్యాచుల్లో తప్పక గెలవాలి. అంతేకాదు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి మన భవితవ్యం ఉంది. మూడు జట్లలో కాస్త కఠినమైన ప్రత్యర్థి అంటే అఫ్గానిస్థాన్. అబుదాబి వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ మీద భారత్ 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ రెండు వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో అఫ్గాన్ 144/7 స్కోరుకే పరిమితమైంది. దీంతో పాయింట్ల పట్టికలో ఖాతాను తెరిచిన భారత్ (2) నాలుగో స్థానంలో ఉంది. ఇప్పటికే పాకిస్థాన్ (8) సెమీస్ బెర్తును ఖరారు చేసుకోగా.. రెండో బెర్తు కోసం అఫ్గాన్ (4), న్యూజిలాండ్ (4) ముందంజలో ఉన్నాయి.

పెద్ద జట్లతోనూ ఇదే మైండ్‌సెట్‌తో ఆడాలి:
తాజాగా వీరేంద్ర సెహ్వాగ్ క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ టీమిండియా ప్రదర్శనపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. 'అనుకున్న విషయాలు మీ దారిలోకి వస్తే.. ఆటోమేటిక్‌గా బాడీలాంగ్వేజ్‌లో మార్పు వస్తుందని అనుకుంటా. అఫ్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు రంగాల్లో ఆధిక్యత ప్రదర్శించింది. కోహ్లీసేన చాలా మంచి క్యాచ్‌లను అందుకుంది. ఇప్పుడే కాకుండా.. పెద్ద జట్లతోనూ ఇదే మైండ్‌సెట్‌తో మ్యాచ్ ఆడాలి. గెలిచినా, ఓడినా ప్రత్యర్థితో పోరాటం చేయాలి. అంతేకానీ తలొగ్గకూడదు. భారత్ పుంజుకుంటుంది' అని వీరూ అన్నాడు.

మార్పులు చేయడం సరైంది కాదు:
కివీస్‌తో మ్యాచ్‌లో తీసుకున్న ఓపెనర్ మార్పు.. 2007 వన్డే ప్రపంచకప్‌లో సచిన్ టెండూల్కర్‌ను నాలుగో స్థానంలో పంపించాలనే నిర్ణయంలాంటిదేనని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నాడు. 'లక్ష్య ఛేదనలో బాగా ఆడుతున్నాం. వరుసగా 17 మ్యాచుల్లో ఛేజింగ్ చేశాం. అలాంటిది 2007 వన్డే ప్రపంచకప్‌లో రెండు పొరపాట్లు చేశాం. అప్పటి మా కోచ్ (గ్రెగ్ ఛాపెల్) జట్టులోని అందరికి బ్యాటింగ్ ప్రాక్టీస్ ఉండాలని చెప్పాడు. అయితే రెండు మ్యాచ్‌లు గెలిచాక సూపర్-8కి వెళ్లే అవకాశం ఉంది, అప్పుడు మిగిలిన ఆరు మ్యాచుల్లో మార్పులు చేద్దామని నేను సూచించా. కోచ్ మాత్రం అలా కుదరదన్నాడు. అప్పటికే సచిన్ టెండూల్కర్ మిడిలార్డర్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేనేలేదు. రాహుల్ ద్రవిడ్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోనీ ఉన్నారు. జట్టు బాగా ఆడనప్పుడు మీ వ్యూహాలను మార్చుకోవాలి. అప్పుడు బాగా ఎందుకు ఆడరు?. అంతేకాని జట్టులో మార్పులు చేయడం సరైంది కాదు' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications