Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇవ్వలేకపోయాడు: కోహ్లిని ‘బర్త్‌ డే గిఫ్ట్‌’ అడిగిన సెహ్వాగ్‌

న్యూఢిల్లీ: అక్టోబర్ 20న టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ 38వ పుట్టిన రోజుని జరుపుకున్నాడు. ఈ సందర్భంగా సెహ్వాగ్‌కు పలువురు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయితే తన పుట్టినరోజు సందర్భంగా సెహ్వాగ్ 'బర్త్‌ డే గిఫ్ట్‌' కావాలని కోహ్లీని కోరాడు.

అయితే సెహ్వాగ్ కోరికను కోహ్లీ తీర్చలేకపోయాడు. ఇంతకీ సెహ్వాగ్... కోహ్లీని ఏమి కోరాడని అనుకుంటున్నారా? ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్‌ల మధ్య ఢిల్లీలో గురువారం రెండో వన్డే జరిగింది. ఈ రెండో వన్డేకి సెహ్వాగ్ కామెంటేటర్‌గా వ్యవహారించారు.

Virender Sehwag demands a special gift from Virat Kohli on his birthday

రెండో వన్డే రోజునే తన పుట్టిన రోజుని జరుపుకుంటున్న సెహ్వాగ్... గిప్ట్ కింద కోట్లాలో సెంచరీ చేసి తనకు బహుమతిగా ఇవ్వాలని కోరాడు. ఇందుకు కోహ్లీ కూడా సరేనన్నాడు. అయితే రెండో వన్డేలో కోహ్లీ కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో సెహ్వాగ్ కోరిక కోహ్లీ తీర్చలేకపోయాడు.

కోహ్లీని తన 'బర్త్‌ డే గిఫ్ట్‌'గా సెహ్వాగ్ అడగడానికి ఓ కారణం ఇద్దరూ ఢిల్లీ క్రికెటర్లు కావడమే. ఇదిలా ఉంటే 2011 వరల్డ్ కప్‌లో సెహ్వాగ్, కోహ్లీ అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ మ్యాచ్‌లో ఒక ఎండ్‌లో కోహ్లీని పెట్టుకుని సెహ్వాగ్ 175 పరుగులు చేయగా, కోహ్లీ కూడా సెంచరీ సాధించాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+