'టీ20 క్రికెట్‌లో చహల్ గొప్ప ఆస్తి.. టీ20 ప్రపంచకప్‌కు ఎందుకు సెలెక్ట్ చేయలేదు! సెలెక్టర్లు వివరణ ఇవ్వాలి'

న్యూఢిల్లీ: యూఏఈలో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశలో టీమిండియా మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అదరగొడుతున్నాడు. రెండో దశలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆడిన మూడు మ్యాచుల్లో వికెట్లు తీసిన ఏకైక బెంగళూరు బౌలర్ యూజీనే. ముఖ్యంగా ఆదివారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో బంతితో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. తన 4 ఓవర్ల స్పెల్‌లో 11 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు.
క్వింటన్ డికాక్ (24), ఇషాన్ కిషన్ (9) మరియు జస్ప్రీత్ బుమ్రా (5)లను చహల్ పెవిలియన్ చేర్చాడు. మొదటి లెగ్‌లో మంచి ప్రదర్శన చేసిన చహల్.. రెండో లెగ్‌లో కూడా మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. దీంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)పై మాజీలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

చహల్‌కు దక్కని చోటు
గత నెలలో ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021 కోసం బీసీసీఐ 15 మందితో కూడిన భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. భారత ప్రపంచకప్ జట్టులో మణికట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్‌కు చోటు దక్కలేదు. రవీంద్ర జడేజాకు జతగా రాహుల్ చహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిలను బీసీసీఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు.
ఐపీఎల్ ప్రదర్శన ద్వారా రాహుల్ చహర్, వరుణ్ చక్రవర్తిలు ప్రపంచకప్‌లో చోటు దక్కించుకున్నారు. దాంతో రెగ్యులర్ స్పిన్నర్ అయిన యూజీకి మాత్రం నిరాశే ఎదురైంది. దీంతో చహల్‌ను ఎందుకు తీసుకోలేదని మాజీలు బీసీసీఐ సెలెక్టర్లను ప్రశ్నిస్తున్నారు. ఏఈ క్రమంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ కూడా బీసీసీఐపై మండిపడ్డాడు.

సెలెక్టర్లు వివరణ ఇవ్వాలి
తాజాగా వీరేందర్ సెహ్వాగ్ క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ... 'యుజ్వేంద్ర చహల్ ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతడు గతంలో కూడా బాగా బౌలింగ్ చేశాడు. అయినా టీ20 ప్రపంచకప్ 2021 జట్టు నుంచి అతడిని ఎందుకు తప్పించారో నాకు అర్థం కాలేదు. ఈ విషయంలో సెలెక్టర్లు వివరణ ఇవ్వాలి. శ్రీలంక పర్యటనలో రాహుల్ చహర్ అంత బాగా ఏమీ బౌలింగ్ చేయలేదు. చహల్ బౌలింగ్ చేస్తున్న తీరు చూస్తే.. అతను టీ20 క్రికెట్‌లో ఏ జట్టుకైనా ఓ ఆస్తిలా ఉంటాడు. ఎలా బౌలింగ్ చేయాలో, వికెట్లు ఎలా తీయాలో అతనికి తెలుసు.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచులో బంతితో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. గ్లెన్ మాక్స్‌వెల్ మరియు యుజ్వేంద్ర చహల్ గేమ్‌ను మలుపు తిప్పారు. మిడిల్ ఆర్డర్‌లలో వికెట్లు తీసి ముంబైని దెబ్బకొట్టారు. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది' అని తెలిపాడు.

అక్టోబర్ 24న తొలి మ్యాచ్ ఆడనున్న భారత్
ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకూ టీ20 ప్రపంచకప్ 2021 జరగనుంది. క్వాలిఫైర్ మ్యాచుతో టోర్నీ ఆరంభం అవుతుంది. రౌండ్ 1లో గ్రూప్ బిలోని ఒమన్, పపువా న్యూ గినియా మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 23న అసలు టోర్నీ అంటే.. సూపర్ 12 స్టేజ్ ప్రారంభమవుతుంది. అబుదాబిలో జరగబోయే తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడతాయి. అదే రోజు దుబాయ్‌లో సాయంత్రం ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు ఆడనున్నాయి. ఇక గ్రూప్ 2లో భాగంగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య దుబాయ్‌లో తొలి మ్యాచ్ జరగనుంది. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత దాయాది జట్లు మరోసారి తలపడనున్నాయి.

భారత టీ20 ప్రపంచకప్ జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.
స్టాండ్ బై ప్లేయర్స్: శ్రేయస్ అయ్యార్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహార్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
KKRvsDC Dream11:కేకేఆర్ vs డీసీ ప్లేయింగ్ ఎలెవన్..డ్రీమ్ 11 టీమ్!పిచ్ రిపోర్ట్.. హెడ్ టు హెడ్ రికార్డ్స్!