Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ కూడా హిట్‌మన్ చేసేది చేయలేడు: సచిన్‌తో రోహిత్‌ను పోల్చిన సెహ్వాగ్

Virender Sehwag compares Rohit Sharma to Sachin Tendulkar, says even Virat Kohli cant do what Hitman does

హైదరాబాద్: టీమిండియా తాత్కాలి కెప్టెన్ రోహిత్ శర్మపై టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అంతేకాదు రోహిత్ శర్మను క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్‌తో పోల్చాడు. కొన్ని సందర్భాల్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా హిట్‌మన్ చేసేది చేయలేడని... అద్భుతమైన స్ట్రయిక్ రేట్‌తో పరుగులు చేయడం గురించి ఈ సందర్భంగా ప్రస్తావించాడు.

రాజ్‌కోట్‌ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్‌ ఘన విజయాన్ని సాధించింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(85; 43 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులు) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో బంగ్లాదేశ్‌ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 15.4 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి ఛేదించడం విశేషం.

సెహ్వాగ్ మాట్లాడుతూ

సెహ్వాగ్ మాట్లాడుతూ

మ్యాచ్ అనంతరం వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ "ఒకే ఓవర్‌లో 3-4 సిక్సర్లు కొట్టడం లేదా 45 బంతుల్లో 80-90 పరుగులు చేయడం ఒక కళ. రోహిత్ మాదిరిగా క్రమం తప్పకుండా కోహ్లీ ఈ విధంగా ఆడటం నేను చూడలేదు" అని తెలిపాడు. ఈ సందర్భంగా సచిన్‌తో గతంలో తనకు ఎదురైన ఒక వృత్తాంతాన్ని సెహ్వాగ్ వెల్లడించాడు.

సచిన్ ఎప్పుడూ ఒకటి చెప్పేవాడు

సచిన్ ఎప్పుడూ ఒకటి చెప్పేవాడు

"సచిన్ జట్టులోని మిగతా సభ్యులకు ఎప్పుడూ చెప్పేవాడు... నేను మైదానంలో పరుగులు చేయగలిగినప్పుడు మీరు ఎందుకు చేయలేరని? చాలా మందికి తెలియదు. దేవుడు ఒక్కడే కొన్ని పనులను చేయగలడని అది దేవుడిది మాత్రమే సాధ్యమని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు, అలా మరెవరూ చేయలేరు కూడా" అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.

తృటిలో ఐదో సెంచరీని చేజార్చుకున్న రోహిత్

తృటిలో ఐదో సెంచరీని చేజార్చుకున్న రోహిత్

కాగా, రెండో టీ20లో రోహిత్‌శర్మ(85) తృటిలో ఐదో సెంచరీని చేజార్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రోహిత్ శర్మ అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టి20ల్లో అత్యధిక సిక్సర్లు(17 ఇన్నింగ్స్‌ల్లో 37 సిక్సులు) బాదిన కెప్టెన్‌గా ఆటగాడిగా నిలిచాడు. అంతకముందు ధోనీ (62 ఇన్నింగ్స్‌ల్లో 34 సిక్సులు) అగ్రస్థానంలో ఉండేవాడు.

ధోని సిక్సుల రికార్డు బద్దలు

ధోని సిక్సుల రికార్డు బద్దలు

ధోని 62 ఇన్నింగ్స్‌లో ఈ రి​కార్డుని నెలకొల్పగా.... రోహిత్‌ శర్మ కేవలం​ 17 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డును సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌లో 6 సిక్సులు బాదడం విశేషం. దీంతో ఈ ఏడాది అత్యధిక సిక్సులు(66) బాదిన క్రికెటర్‌గా నిలిచాడు. 2017లో 65 సిక్సులు కొట్టిన రోహిత్ 2018లో 74 బాదాడు.

టీ20ల్లో నాలుగో సారి

టీ20ల్లో నాలుగో సారి

టీ20ల్లో నాలుగో సారి శిఖర్‌ ధావన్‌తో కలిసి వంద పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. గతంలో కోహ్లీతో కలిసి మూడు సార్లు వందకు పైగా భాగస్వామ్యాలు నమోదు చేశాడు. రాజ్‌కోట్‌ మ్యాచ్‌లో వీరిద్దరూ 118 పరుగుల భారీ ఓపెనింగ్‌ భాగస్వామ్యం నెలకొల్పి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

Story first published: Friday, November 8, 2019, 14:37 [IST]
Other articles published on Nov 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+