సెహ్వాగ్ విసిరిన మరో ఛాలెంజ్‌కు నెటిజన్ల స్పందన

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్.. బ్యాటింగ్‌తోనే కాదు.. ట్వీట్లతోనూ వైవిధ్యంగా అనిపిస్తుంటాడు. ఇదే క్రమంలో తాను ఇటీవల చేసిన ట్వీట్‌కు మంచి స్పందనతో పాటు వైరల్‌గానూ మారింది. సరదా కామెంట్లతో అభిమానులు, నెటిజన్ల పెదాల నవ్వులు పూయిస్తున్నారు. తాజాగా ఆయన నెటిజన్లకు క్రికెట్ రైమింగ్ ఛాలెంజ్ విసిరారు. ఆయన సవాలును స్వీకరించి, వారు అంతే వేగంగా సమాదానాలిచ్చారు. ఇంగ్లాండ్, శ్రీలంక టెస్టు మ్యాచ్ నేపథ్యంలో ఈ కామెడీ చోటుచేసుకుంది.
వోక్స్‌ను ఎంపిక చేసి ఉంటే
‘ఇంగ్లాండ్ వోక్స్‌ను ఎంపిక చేసి ఉంటే, స్టోక్స్, ఫోక్స్, వోక్స్‌ను ఒకేసారి చూసి ఉండేవాళ్లం. వారు ముగ్గురు కలిసి ఆడే రోజు వస్తుందని వేచిచూద్దాం' అని ఇంగ్లాండ్ జట్టుకు ఎంపికైన బెన్ స్టోక్స్, బెన్ ఫోక్స్, క్రిస్ వోక్స్ గురించి వ్యాఖ్యానించారు. అయితే ఇక్కడితో ఆగకుండా అభిమానులకు కూడా అలాంటి పేర్లు చెప్పమని సవాలు విసిరారు. దానికి వారిని నుంచి ఆశ్చర్యకరమైన సమాధానాలు వచ్చాయి.
‘కర్'తో ముగిసే 12 మంది పేర్లు
అజయ్(జడేజా), విజయ్(మురళి), సంజయ్(మంజ్రేకర్) పేర్లతో ఒక నెటిజన్ స్పందించగా, మరొక వ్యక్తి ‘కర్'తో ముగిసే 12 మంది పేర్లను(సునీల్ గావస్కర్, రామనాథ్ పార్కర్, అజిత్ వాడేకర్, సచిన్ టెండూల్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, విజయ్ మంజ్రేకర్, సంజయ్ మంజ్రేకర్, ఏక్‌నాథ్ సోల్కర్, అజిత్ అగార్కర్, దత్తారామ్ హిందేల్కర్, గులామ్ పార్కర్ అంటూ పేరు చివర్లో కర్ వచ్చే విధంగా ఉన్న పేర్లను ట్వీట్ చేశాడు.
మహేంద్ర, రవీంద్ర, యుజ్వేంద్ర
ఇంకొందరి నుంచి వచ్చిన సమాధానాలు కూడా అలానే ఉన్నాయి. మహేంద్ర(ధోని), రవీంద్ర(జడేజా), యుజ్వేంద్ర(చాహల్)... ంద్ర పేరు చివర్లో వచ్చే విధంగా..
పాంట్, షార్ట్, టై అంటూ వెరైటీగా
దినేశ్, సురేశ్, ఉమేశ్‌ల పేర్లను శ్ ఆఖర్లో వచ్చే విధంగా.., సునీల్, కపిల్, అనిల్... క్రికెటర్ల పేర్లను ల్ వచ్చే విధంగా.., బుమ్రా, నెహ్రా,మిశ్రా.. ధోని, గోని, బిన్ని అని స్పందించారు. అయితే మరో నెటిజన్ మాత్రం దుస్తుల పేర్లు ఉన్నక్రికెటర్లను వెలుగులోకి తెచ్చాడు. పంత్(ప్యాంట్), షార్ట్, లుంగి, టై అంటూ వెరైటీ ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications