వీరూకి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షల వెల్లువ

న్యూ ఢిల్లీ: వీరేంద్ర సెహ్వాగ్ అనగానే మొదట గుర్తుకు వచ్చేది దూకుడుతో కూడిన అతడి బ్యాంటింగే. బ్యాటుతో మైదానంలోకి అడుగు పెడుతున్నాడంటే క్రికెట్ అభిమానులకు పండగే. ఈ భారత మాజీ ఓపెనర్ ఈ రోజు 40వ పుట్టిన రోజు జరుపుకొంటున్నాడు. దాంతో క్రికెట్ ప్రపంచం నుంచి అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బీసీసీఐ, ఐసీసీ కూడా వీరూకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశాయి.
టీమిండియా తరఫున 104 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన సెహ్వాగ్ 8586 పరుగులు చేశాడు. వన్డేల్లో 251 మ్యాచ్‌లు ఆడి 8273 పరుగులు చేయగా, స్ట్రైక్ రేట్ 104.33గా ఉంది. వీరూ టీ20ల్లో బ్యాట్ తో విశ్వరూపం చూపించేవాడు. ఆ ఫార్మాట్లో ఆడిన 19 మ్యాచుల్లో 145.38 స్ట్రైక్ రేట్‌తో దూసుకుపోయాడు.
‘నయా వివ్ రిచర్డ్స్, నా ప్రియ మిత్రుడికి..
సెహ్వాగ్‌తో కలిసి క్రికెట్ ఆడిన హర్భజన్ సింగ్ అయితే అతణ్ని ఆకాశానికి ఎత్తేశాడు. ఆధునిక తరం వివియన్ రిచర్డ్స్‌గా వీరూను అభివర్ణిస్తూ.. అతడికి బర్త్ డే విషెస్ తెలిపాడు. ‘నయా వివ్ రిచర్డ్స్, నా ప్రియ మిత్రుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మొత్తం సంతోషాలతో నిండిపోవాలి' అని ట్వీట్ చేశాడు భజ్జీ.
నజఫ్‌గఢ్ నవాబ్‌కు ట్విటర్ వేదికగా
సురేశ్ రైనా, వీవీఎస్ లక్ష్మణ్, ఇశాంత్ శర్మ తదితరులు కూడా ఈ నజఫ్‌గఢ్ నవాబ్‌కు ట్విటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు.. కెప్టెన్‌గా డబుల్ సెంచరీ సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా వీరూ రికార్డ్ క్రియేట్ చేశాడు.
డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన బీసీసీఐ
కాగా బీసీసీఐ ఈ వీడియోను 2015లో వీరూ బర్త్ డే సందర్భంగా క్రియేట్ చేసింది. తిరిగి దాన్నే పోస్ట్ చేసింది. 2011లో వెస్టిండీస్‌పై వన్డేల్లో వీరూ డబుల్ సెంచరీ సాధించిన వీడియోను షేర్ చేసిన బీసీసీఐ డ్యాషింగ్ బ్యాట్స్‌మెన్‌కు బర్త్ డే విషెస్ తెలిపింది. ఇండోర్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో వీరూ 149 బంతుల్లో 219 పరుగులు చేశాడు.
40వ పుట్టిన రోజు శుభాకాంక్షలంటూ ఐసీసీ
17253 పరుగులు, టెస్టుల్లో భారత్ తరఫున తొలి ట్రిపుల్ సెంచరీ, వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన రెండో బ్యాట్స్‌మెన్.. వీరూకు 40వ పుట్టిన రోజు శుభాకాంక్షలంటూ ఐసీసీ ట్వీట్ చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications