అలా అయితేనే హార్దిక్ పాండ్యా టెస్టు జట్టులో ఆడాలి: సెహ్వాగ్‌

Ind vs Aus 2020 : Virender Sehwag - If Pandya Was Fit To Bowl,He Would Have Been Part Of Test Squad

ఢిల్లీ: టెస్టుల్లో ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి వేగంగా పరుగులు సాధించే స్టార్ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా జట్టులో ఉండడం టీమిండియాకు కలిసొచ్చే అంశమని మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. అయితే హార్దిక్‌ పూర్తి ఫిట్‌నెస్ సాధించి బౌలింగ్‌ చేయగలిగితేనే టెస్టు జట్టులో ఉండాలని సూచించాడు. గతేడాది కాలంగా హార్దిక్ ఎక్కువగా క్రికెట్ ఆడని విషయం తెలిసిందే. వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం హార్దిక్‌ బౌలింగ్‌ చెయ్యట్లేదు. కేవలం బ్యాటింగ్ మాత్రమే చేస్తున్నాడు.

 బౌలింగ్‌ చేయగలిగితేనే:

బౌలింగ్‌ చేయగలిగితేనే:

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య డిసెంబర్ 17 నుంచి వచ్చే ఏడాది జనవరి 19 వరకు బోర్డర్ గావస్కర్ ట్రోఫీ జరగనుంది. ఈ టెస్టు సిరీస్ గురించి ఓ కార్యక్రమంలో ఆస్ట్రేలియా‌ మాజీ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ మాట్లాడుతూ.. ఆసీస్‌ పర్యటనలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రాణించిన హార్దిక్‌ పాండ్యా సుదీర్ఘ ఫార్మాట్‌కు ఎంపిక కావాల్సిందన్నాడు. దీనిపై వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. 'హార్దిక్‌ బౌలింగ్‌ చేయగలిగితేనే టెస్టు జట్టులో ఉండాలి. వన్డే, టీ20లకు మాత్రమే ఆడతానని.. బౌలింగ్‌కు ఫిట్‌నెస్‌ సాధించలేదనో సెలక్టర్లకు హార్దిక్ చెప్పొచ్చు. పరిమిత ఓవర్ల క్రికెట్ అనంతరం తిరిగి కుటుంబంతో కలుస్తానని అనొచ్చు. అయితే హార్దిక్ బౌలింగ్‌ చేయడం మొదలుపెడితే జట్టులో కీలక ఆటగాడు అవుతాడు' అని వీరూ అన్నాడు.

మెరుపు బ్యాటింగ్‌ చేస్తే:

మెరుపు బ్యాటింగ్‌ చేస్తే:

'వన్డే, టీ20ల్లో మాదిరిగానే టెస్టు క్రికెట్‌లో ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి హార్దిక్ పాండ్యా మెరుపు బ్యాటింగ్‌ చేస్తే ఎలా ఉంటుందో ఓసారి ఊహించండి. హార్దిక్ చెలరేగితే భారత్‌ మెరుగైన స్థితిలో నిలుస్తూ గెలుపు దిశగా పయనిస్తుంది. టెస్టు క్రికెట్లో వేగంగా పరుగులు సాధించడం అత్యంత కీలకం. ప్రత్యర్థి జట్టును ఆలౌట్‌ చేసేందుకు బౌలింగ్‌ విభాగానికి కావాల్సినంత సమయం కూడా దొరుకుతుంది' అని వీరేంద్ర సెహ్వాగ్‌ అన్నాడు. డిసెంబర్‌ 17 నుంచి భారత్-ఆస్ట్రేలియా నాలుగు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుండగా అడిలైడ్ వేదికగా తొలి డే/నైట్ టెస్టు జరగనుంది.

బౌలింగ్‌కు దూరం:

బౌలింగ్‌కు దూరం:

వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకున్న అనంతరం హార్దిక్‌ భారత జట్టులోకి వచ్చినా.. బౌలింగ్‌కు దూరంగా ఉంటున్నాడు. దేహంపై భారం పడకుండా ఉండేందుకు బౌలింగ్ ‌చెయ్యట్లేదు. తప్పని పరిస్థితుల్లో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో మాత్రం నాలుగు ఓవర్లు వేశాడు. అయితే ధనాధన్‌ ఇన్నింగ్స్‌లతో భారత్ టీ20 సిరీస్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఆసీస్‌ పర్యటనలోని పరిమిత ఓవర్ల క్రికెట్లో‌ రెండు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌లతో పాటు మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్ గెలిచాడు.

దూకుడుకు ప్రతినిధి.. విరాట్ కోహ్లీని మించినోడు లేడు: గ్రెగ్‌ ఛాపెల్‌

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
 
Story first published: Saturday, December 12, 2020, 12:27 [IST]
Other articles published on Dec 12, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X