Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోచ్ రేసు: కుంబ్లేకి పోటీగా సెహ్వాగ్, దరఖాస్తుపై ఎమన్నాడో తెలుసా?

హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే పదవీ కాలం ఛాంపియన్స్ ట్రోఫీతో ముగుస్తుండటంతో బీసీసీఐ కొత్త కోచ్ ఎంపిక కోసం ప్రక్రియ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. నిజానికి కుంబ్లే పదవీ కాలం పెంచుతారని అందరూ ఊహించగా అందుకు విరుద్ధంగా బీసీసీఐ కొత్త కోచ్‌ నియామక ప్రక్రియ ఆరంభించింది.

దీంతో అతడి స్థానాన్ని భర్తీ చేసేందుకు కోచ్ పదవికి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చంటూ గురువారం బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. అనిల్ కుంబ్లే కూడా ఈ పదవికి మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అయితే కుంబ్లేకి పోటీగా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ బరిలోకి దిగుతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

Virender Sehwag Asked to Apply for the Post of India Coach

బీసీసీఐకి చెందిన ఓ అధికారి సెహ్వాగ్‌ను కలిసి కోచ్‌ పదవికి దరఖాస్తు చేసుకోమని సూచించాడట. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ వార్తలను సెహ్వాగ్‌ కొట్టిపారేశాడు. తనను ఏ అధికారి కలవలేదని కొద్ది రోజులు ఆగితే ఎవరూ దరఖాస్తు చేస్తారో తెలుస్తుందని చెప్పుకొచ్చాడు.

గతేడాది కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనిల్ కుంబ్లే నేతృత్వంలోని భారత జట్టు స్వదేశంలో ఐదు టెస్టు సిరీస్‌లు గెలిపించి, భారత క్రికెట్‌ జట్టును టెస్టుల్లో తిరిగి నెంబర్‌వన్‌గా నిలబెట్టడంతో అద్భుతమైన పాత్ర పోషించాడు. ఆలాంటి కుంబ్లేను కొనసాగించకుండా బీసీసీఐ మళ్లీ ఎంపిక ప్రక్రియ చేపట్టాలనుకోవడం అనూహ్య నిర్ణయమేనని అంటున్నారు.

టీమిండియాకు కొత్త కోచ్ నియామక ప్రక్రియపై బీసీసీఐ వ్వవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే మాజీ క్రికెటర్లు పలువురు బోర్డు వైఖరిని తప్పుబట్టిన సంగతి తెలిసిందే. తాజాగా కోచ్ ఎంపికపై బీసీసీఐ అనుసరిస్తున్న తీరుపై లోధా కమిటీ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏడాది కాలంగా కుంబ్లే చక్కని పనితీరును చూసి అతని పదవీకాలం పెంచాల్సిందిగా లోధా కమిటీ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+