Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హిట్ మ్యాన్ రిటైర్మెంట్ ప్రకటించడం మంచిది: వీరేంద్ర సెహ్వాగ్

IPL 2025: ముంబై క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ పదవీ విరమణ వయస్సు దాటి ఆడటంపై భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. గత 10 సీజన్లలో ఒకే ఒక్కసారి 400 పరుగులు చేశానని చెప్పిన రోహిత్ శర్మ.. రాబోయే మ్యాచ్‌లలో తన విధానాన్ని కొంచెం మార్చుకుని పరుగులు జోడించాలని కూడా సలహా ఇచ్చాడు. ఐపీఎల్‌లో ముంబై లెజెండ్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అద్భుతంగా ప్రారంభించిన రోహిత్ శర్మ 3 సిక్సర్లు కొట్టిన తర్వాత భారీ స్కోరు సాధిస్తాడని భావించారు. కానీ ఎప్పటిలాగా 16 బంతుల్లో 26 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు.

ఈ సీజన్ లో ఇప్పటివరకు ఆడిన 6 ఇన్నింగ్స్ లో రోహిత్ శర్మ కేవలం 82 పరుగులు మాత్రమే చేశాడు. రోహిత్ శర్మ గత 22 ఇన్నింగ్స్ లలో 6 సార్లు మాత్రమే 20 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. మిగిలిన 16 ఇన్నింగ్స్ లలో రోహిత్ శర్మ బ్యాట్ నుంచి 20 పరుగులకు మించలేదు. దీంతో హిట్ మ్యాన్ అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తున్నారు. దీని ఫలితంగా ఈ సీజన్ చివరిలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ ప్రకటించాల్సిన సమయం ఇప్పటికే ఆసన్నమైందని క్రికెట్ లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు. అభిమానులు సంతోషంగా ఉన్నప్పుడు రోహిత్ శర్మ తప్పుకోవడం మంచిదని ప్రకటించాడు. ఎందుకంటే భవిష్యత్తులో అభిమానులు "ఇక చాలు.. రిటైర్ అవ్వండి" అని చెప్పడం ప్రారంభిస్తారని చెప్పుకొచ్చాడు.

Virender Sehwag Advises Rohit Sharma to Retire Gracefully from IPL

గత పదేళ్లలో రోహిత్ శర్మ ఒకే ఒక్కసారి 400 కంటే ఎక్కువ పరుగులు చేశాడని.. రోహిత్ ప్రతి సీజన్ లో 500 నుంచి 700 పరుగులు సాధించాలని ఆశించే ఆటగాడు కాదని సెహ్వాగ్ అన్నాడు. రోహిత్ భారత జట్టు కెప్టెన్ గా ఉన్నప్పుడు పవర్ ప్లేలో దాడి చేయడానికి, పరుగులు సాధించడానికి ఆడాడని చెప్పుకొచ్చారు. జట్టు కోసం త్యాగాలు చేశాడు.. కానీ ఏదో ఒక సమయంలో రోహిత్ పరుగులు సాధించకపోతే చాలా కష్టమవుతుంది అన్నాడు.

ఎవరైనా రోహిత్ శర్మ దగ్గరికి వెళ్లి మొదటి 10 బంతులు ఓపికగా ఆడమని చెప్పాలన్నాడు. రోహిత్ శర్మను ఏ ఇన్నింగ్స్‌లోనూ పుల్ షాట్ ఆడవద్దని హెచ్చరించాలని అన్నాడు. తాను ఆడుతున్నప్పుడు ఫామ్‌లో లేనప్పుడు సచిన్, రాహుల్ ద్రవిడ్, గంగూలీ, ఇతరులు కొంచెం ప్రశాంతంగా ఆఢాలని తనకు చెప్పేవారని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ఆ విషయం రోహిత్ శర్మకు ఎవరైనా చెప్పాలని స్పష్టం చేశాడు.

Story first published: Friday, April 18, 2025, 13:50 [IST]
Other articles published on Apr 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+