ఫోటోలు: తలపై ప్రేమగా నిమురుతూ కెప్టెన్ కోహ్లీ
చెన్నై: టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచి మనసున్న వ్యక్తి, గొప్ప వ్యక్తిత్వం కలవాడని ట్విట్టర్‌లో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ కోహ్లీ చేసిన ఆ గొప్ప ఏంటని అనుకుంటున్నారా? కోహ్లీకి మూగజీవాలంటే ఎంతో ప్రేమ. అందులో కుక్కలంటే ఇంకా ఇష్టం.
ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో చివరిదైన ఐదో టెస్టు గురువారం నుంచి చెన్నైలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే భారత్, ఇంగ్లాండ్ జట్ల ఆటగాళ్లు చెన్నై చేరుకున్నారు. 'వర్దా' తుఫాన్ కారణంగా చెన్నైలోని చెపాక్ స్టేడియం తడిసి ముద్దవడంతో బుధవారం ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు దూరమయ్యారు.
పిచ్‌ను పరిశీలిస్తున్న స్ఫిన్ త్రయం అశ్విన్, జడేజా, జయంత్
గురువారం మధ్యాహ్నానానికి ఔట్ ఫీల్డ్ ఆరిపోవడంతో ఇరు జట్లకు చెందిన ఆటగాళ్లు ప్రాక్టీసులో పాల్గొన్నారు.
తలపై ప్రేమగా నిమురుతూ కోహ్లీ
ఇదే సమయంలో స్టేడియంలో తనిఖీలు నిర్వహించేందుకు వచ్చిన శునకాలతో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ కొంత సమయం గడిపారు. కాసేపు వాటితో సరదాగా గడిపిన కోహ్లీ ఓ శునకం తలపై ప్రేమగా నిమురుతూ మంచినీరు తాగించాడు. కోహ్లీ శునకాలకు నీరు తాగించే ఫోటోలను బీసీసీఐ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
మద్రాసు క్రికెట్ క్లబ్
ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. మరోవైపు శుక్రవారం నుంచి ఐదో టెస్టు మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో చెన్నైలోని చిదంబరం స్టేడియం వద్ద భద్రతను పెంచారు. భద్రతా సిబ్బంది స్టేడియం లోపల, బయట తనిఖీలు నిర్వహించారు.
3-0తో టెస్టు సిరిస్‌ని కైవసం చేసుకున్న భారత్
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 3-0తో భారత్ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నై టెస్టులో కూడా విజయం సాధించి 4-0తో సిరిస్‌ను చేజిక్కించుకోవాలనే ఆలోచనలో కోహ్లీ సేన ఉంది. మరోవైపు కనీసం చివరి టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలనే కసిలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఉన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications