Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs BAN: కోహ్లి సిక్సర్ల మోత.. బద్దలైన గోడ (Video)

దాదాపు నెలన్నర రోజుల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా తిరిగి బరిలోకి దిగుతోంది. స్వదేశంలో బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌కు చెన్నై వేదిక కానుంది. సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా చివరి టెస్టు జరగనుంది.

ఈ సిరీస్‌ను క్వీన్‌స్వీప్ చేసి వరల్ట్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు అవకాశాలను మరింత మెరుగుపర్చుకోవాలని భారత్ పట్టుదలతో ఉంది. ఈ క్రమంలో టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్‌లో చెమటోడుస్తున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో సాధన చేస్తున్నారు. ప్రాక్టీస్‌లో స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ భారీ షాట్లతో విరుచుకుపడుతున్నారు.

Virat Kohli Smashes Dressing Room Wall with Powerful Six During Practice at Chepauk Ahead of Bangladesh Series

ప్రాక్టీస్‌లో విరాట్ కోహ్లి చేసిన విధ్వంసానికి గోడకు రంధ్రం పడింది. కవర్ డ్రైవ్, కట్స్, లాఫ్టెడ్ షాట్లతో కోహ్లి సాధన చేశాడు. అయితే క్రీజును దాటి ముందుకు వచ్చి కోహ్లి ఆడిన భారీ షాట్‌కు డ్రెస్సింగ్‌ రూమ్‌ సమీపంలోని గోడ బద్దలైంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. టెస్టు సిరీస్‌లో కోహ్లి ఇదే జోరు కొనసాగించాలని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

టీ20 వరల్డ్ కప్ అనంతరం పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి వన్డే, టెస్టు ఫార్మాట్ మాత్రమే ఆడుతున్నాడు. అయితే ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో కోహ్లి నిరాశపరిచాడు. 24, 14, 20 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ టెస్టు సిరీస్‌తో తిరిగి ఫామ్‌లో రావాలని కోహ్లి కసిగా ప్రాక్టీస్ సాధన చేస్తున్నాడు.

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుకు ఎంపికైన టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్‌), యశస్వీ జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్‌ పంత్ (వికెట్‌ కీపర్‌), ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్‌), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్‌ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్, జస్‌‌ప్రీత్ బుమ్రా, యశ్ దయాల్‌.

భారత్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికైన బంగ్లాదేశ్ జట్టు: నజ్ముల్ హొస్సేన్ షాంటో (కెప్టెన్), షాద్మాన్ ఇస్లాం, జాకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్, మెహిదీ హసన్ మిరాజ్, జేకర్ అలీ, తస్కిన్ అహ్మద్, హసన్ మహ్మద్, నహిద్ రానా, తైజుల్ ఇస్లామ్, మహ్మదుల్ హసన్ జాయ్, నయీమ్ హసన్, ఖలీద్ అహ్మద్.

Story first published: Monday, September 16, 2024, 9:56 [IST]
Other articles published on Sep 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+