హైదరాబాద్: ఉప్పల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఇండియన్ 'రన్ మెషిన్' డబుల్ సెంచరీ (204) పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. తద్వారా వరుసగా నాలుగు టెస్టు సిరీస్‌ల్లో డబుల్ సెంచరీలు సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు.
అంతక ముందు వెస్టిండిస్‌పై 200, న్యూజిలాండ్‌పై 211, ఇంగ్లాండ్‌పై 235 ఇలా వరుసగా మూడు డబుల్ సెంచరీలు చేసిన కోహ్లీకి ఇది నాలుగో డబుల్ సెంచరీ. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజాలు డాన్ బ్రాడ్‌మన్, రాహుల్ ద్రవిడ్ లాంటి దిగ్గజాలను కోహ్లీ అధిగమించాడు.

డాన్ బ్రాడ్‌మన్, రాహుల్ ద్రవిడ్‌లు మాత్రమే వరుసగా మూడు సిరిస్‌లలో మూడు డబుల్ సెంచరీలను సాధించారు. దీంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డుపై సోషల్ మీడియాలో అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.