హైదరాబాద్: పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకున్న నేపథ్యంలో జాతీయ సెలక్టర్లు ఆ బాధ్యతలను విరాట్ కోహ్లీకి అప్పగించారు. ధోని నుంచి కోహ్లీ కెప్టెన్సీ బాధ్యతలను తీసుకున్న నేపథ్యంలో కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ స్పందించారు.
కోహ్లీకి ఇది చాలా గర్వించదగిన సమయం అని అన్నారు. మూడు ఫార్మెట్‌లలో కూడా విరాట్ కెప్టెన్‌గా అయినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. కెప్టెన్సీ బాధ్యతలను ఓ ఛాలెంజ్‌గా తీసుకుని వాటిని విజయవంతం చేయడంలో కోహ్లీ ఎప్పుడూ ముందుంటాడని ఆయన అన్నారు.
టెస్టు ఫార్మెట్‌లో ఏవిధంగానైతే టీమిండియాకు విజయాలను కట్టబెట్టాడో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అదే విధంగా రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశారు. భారత జట్టుకు సేవలందించిన అత్యుత్తమ కెప్టెన్లలో ధోని ఒకడని రాజ్ కుమార్ శర్మ కితాబిచ్చారు. ధోని మాదిరే కోహ్లీ కూడా టీమిండియాకు సమాన స్థాయిలో జట్టుకు విజయాలు అందిస్తాడని అన్నారు.
ధోని కెప్టెన్‌గా ఉన్న సమయంలో కోహ్లీ వైస్ కెప్టెన్‌గా పలు మ్యాచ్‌లకు వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో మైదానంలో కఠిన పరిస్థితులు ఎదురైనప్పుడు కూల్‌గా ఎలా ఉండాలో ధోని నుంచి కోహ్లీ తప్పకుండా నేర్చుకుని ఉండాడనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
కోహ్లీ కూడా ధోనిలా: కెప్టెన్సీపై గంగూలీ ఏమన్నాడో తెలుసా?
కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా జట్టులో ధోని ఉండటం కోహ్లీకి ఎంతగానో కలిసొచ్చే అంశమని శర్మ వెల్లడించారు. బుధవారం నాడు వన్డే, టీ20 కెప్టెన్సీ నుంచి ధోని తప్పుకుంటున్నట్టు సమాచారం అందించాడని బీసీసీఐ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

కెప్టెన్సీకి గుడ్ బై చెప్పిన జనవరి 15 నుంచి ఇంగ్లాండ్‌తో జరగబోయే వన్డే, టీ20 సిరిస్‌కు ధోనిని వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్‌గా సెలక్టర్లు ఎంపిక చేశారు. కెప్టెన్‌గా భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలనందించాడు. తన కెరీర్‌లో మొత్తం 199 వన్డేలకు, 72 టీ20లకు, 60 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహారించిన ధోని ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
యువీ రాణిస్తాడు, సక్సెస్ అవుతాడు: మద్దతు పలికిన గంగూలీ
భారత క్రికెట్ చరిత్రలో కెప్టెన్‌గా ధోనిది ప్రత్యేకమైన స్ధానం. వన్డే ప్రపంచ కప్.. ఛాంపియన్స్ ట్రోఫీ.. టీ20 ప్రపంచ కప్‌లు ఇలా మూడూ సాధించిన ఏకైక కెప్టెన్‌గా చరిత్రలో నిలిచిపోయాడు. అంతేకాదు భారత్ తరుపున ఆరు వరల్డ్ టీ20 టోర్నీలకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఏకైక కెప్టెన్‌గా ధోని ఓ అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు.
ఇంగ్లాండ్‌తో మూడు వన్డేలకు భారత జట్టు:
వన్డే జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), మహేంద్ర సింగ్ ధోని (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, యువరాజ్ సింగ్, అజింక్య రహానె, హార్దిక్ పాండ్య, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్.
ఇంగ్లాండ్‌తో మూడు టీ20లకు భారత జట్టు:
టీ20 జట్టు: విరాట్ కోహ్లి (కెప్టెన్), మహేంద్ర సింగ్ ధోని (వికెట్ కీపర్), మన్‌దీప్ సింగ్, కేఎల్ రాహుల్, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా, రిషబ్‌పంత్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్, మనీశ్ పాండే, బుమ్రా, భువనేశ్వర్, ఆశిష్ నెహ్రా