Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: విరాట్ కోహ్లీ అ‌న్‌బ్రేకబుల్ టెస్ట్ రికార్డులు ఇవే..!

Virat Kohli Test Records: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోని టాప్ బ్యాటర్లలో ఒకడు. భారత మాజీ కెప్టెన్ తన దూకుడు బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను చాలా సార్లు చిత్తు చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన విరాట్ కోహ్లీ గొప్ప రికార్డును కలిగి ఉన్నాడు. తాజాగా విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిసింది. దీని కోసం విరాట్ కోహ్లీ తన అభిప్రాయాలను బీసీసీఐకి కూడా తెలియజేశాడు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని బీసీసీఐ విరాట్ కోహ్లీని కోరింది. కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్ గురించి ఇప్పటివరకు ఎటువంటి అధికారిక సమాచారం లేదు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కెరీర్‌లో నమోదు చేసిన 5 అ‌న్‌బ్రేకబుల్ టెస్ట్ రికార్డుల గురించి తెలుసుకుందాం.

1. టెస్ట్ కెప్టెన్‌గా అత్యధిక డబుల్ సెంచరీలు
టెస్ట్ కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. విరాట్ కోహ్లీ 123 టెస్ట్ మ్యాచ్‌లకు గానూ 210 ఇన్నింగ్స్‌లలో 9230 పరుగులు చేశాడు. అందులో విరాట్ కోహ్లీ 7 సార్లు డబుల్ సెంచరీ చేశాడు. విరాట్ కోహ్లీ తన టెస్ట్ కెరీర్‌లోని మొదటి ఐదేళ్లలో ఒక్క డబుల్ సెంచరీ కూడా చేయలేదు. కానీ 2016 నుంచి విరాట్ కోహ్లీ 7 సార్లు డబుల్ సెంచరీలు సాధించాడు. టెస్ట్ క్రికెట్‌లో 7 సార్లు డబుల్ సెంచరీ చేసిన ఏకైక భారత టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. భవిష్యత్తులో ఏ భారత టెస్ట్ కెప్టెన్ కూడా ఈ రికార్డును బద్ధలుకొట్టడం అసాధ్యమే.

Virat Kohli s Unbreakable Test Records A Glorious Legacy in Indian Cricket

2.టెస్ట్ కెప్టెన్‌గా భారత్ తరఫున అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన వ్యక్తి
విరాట్ కోహ్లీ భారత టెస్ట్ కెప్టెన్ గా ఉండగా.. 68 మ్యాచ్‌లు ఆడి 40 మ్యాచ్‌ల్లో జట్టును విజయపథంలో నడిపించాడు. అయితే జట్టు 17 మ్యాచ్‌ల్లో ఓటమిని చవిచూసింది. కింగ్ కోహ్లీ భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లలో విజయం సాధించాడు. విరాట్ కోహ్లీ తర్వాత ఎంఎస్ ధోని ఉన్నాడు. ధోని కెప్టెన్‌గా ఉండగా.. 60 టెస్ట్ మ్యాచ్‌లలో 27 మ్యాచ్‌లలో జట్టును గెలిపించాడు. ఈ క్రమంలో కోహ్లీ రికార్డును ఎప్పటికీ బద్దలు కొట్టడం సాధ్యం కాదు.

3.భారత కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ మ్యాచ్‌లు
విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లకు భారత జట్టుకు నాయకత్వం వహించాడు. విరాట్ కోహ్లీ 68 మ్యాచ్‌లకు నాయకత్వం వహించాడు. అందులో జట్టు 40 గెలిచి 17 ఓడిపోయింది. 11 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా విజయ శాతం 58.82 శాతంగా ఉంది.

4.కోహ్లీ లాగా కెప్టెన్సీ రికార్డు సృష్టించడం కష్టమే..
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలో టెస్ట్ సిరీస్‌లు గెలిచిన ఏకైక కెప్టెన్ విరాట్ కోహ్లీ. సెనా(SENA-South Africa, England, New Zealand, Australia) దేశాల్లో అత్యధిక టెస్ట్ విజయాలు సాధించిన ఆసియా కెప్టెన్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. విరాట్ కెప్టెన్సీలో భారత్ సొంతగడ్డపై ఆడిన 31 మ్యాచ్‌ల్లో 24 గెలిచి 2 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ధోని కెప్టెన్సీలో భారత్ 30 మ్యాచ్‌‌ల్లో గెలిచి, 21 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. రోహిత్ శర్మ కెప్టెన్‌గా 16 మ్యా‌చ్‌ల్లో 10 గెలిచి, 5 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. విదేశీ గడ్డపై భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన విరాట్ కోహ్లీ 36 మ్యాచ్‌ల్లో 16 గెలిచి, 15 మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యాడు. ధోని కెప్టెన్సీలో టీమిండియా విదేశాలలో 30 మ్యాచ్‌లలో 6 మాత్రమే గెలవగా, 15 ఓడిపోయింది. 9 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. రోహిత్ కెప్టెన్సీలో భారత్ 5 మ్యాచ్‌ల్లో 2 గెలిచి, 2 ఓడిపోయింది. ఒక మ్యాచ్ డ్రా అయింది.

5.భారత కెప్టెన్‌గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు
భారత కెప్టెన్‌గా టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసి ఘనత విరాట్ కోహ్లీదే. విరాట్ కోహ్లీ 30 సెంచరీలతో సహా 5864 పరుగులు చేశాడు. భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఏ ఆటగాడు కోహ్లీలా ఎక్కువ పరుగులు చేయలేకపోయాడు.

విరాట్ కోహ్లీ టెస్ట్ గణాంకాలు:
*ఆడిన మొత్తం మ్యాచ్‌లు: 123
*ఇన్నింగ్స్ : 210
*పరుగులు: 9230 పరుగులు
*అత్యధిక స్కోరు: 254* పరుగులు
*సగటు: 55.57
*సెంచరీలు: 30
*అర్థ సెంచరీలు: 51

Story first published: Saturday, May 10, 2025, 16:25 [IST]
Other articles published on May 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+