విరాట్ కోహ్లి స్ట్రైక్‌రేట్‌పై మరోసారి చర్చ మొదలైంది. టీ20 ఫార్మాట్‌కు కోహ్లి సరిపోడని నెట్టింట వాదనలు వినిపిస్తున్నాయి. నెటిజన్లతో పాటు కొందరు భారత మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, ఆర్పీ సింగ్ కూడా విరాట్ బ్యాటింగ్‌పై విమర్శలు గుప్పించారు. మరోవైపు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆరోన్ ఫించ్ మాత్రం కోహ్లికి అండగా నిలిచాడు.
అసలేం జరిగిదంటే.. ఉప్పల్ వేదికగా గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 35 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 206 పరుగులు చేసింది. రజత్ పటిదార్ (50; 20 బంతుల్లో, 2x4, 5x6) మెరుపు అర్ధశతకం సాధించాడు. కామెరూన్ గ్రీన్ (37*; 20 బంతుల్లో, 5x4) ఆకట్టుకున్నాడు.

విరాట్ కోహ్లి (51; 43 బంతుల్లో, 4x4, 1x6) అర్ధశతకం అందుకున్నప్పటికీ నిదానంగా బ్యాటింగ్ చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో జయదేవ్ ఉనద్కత్ మూడు (3/30) వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 171 పరుగులు చేసింది. షాబాజ్ అహ్మద్ (40*; 37 బంతుల్లో, 1x4, 1x6) టాప్ స్కోరర్. అభిషేక్ శర్మ (31; 13 బంతుల్లో, 3x4, 2x6), ప్యాట్ కమిన్స్ (31; 15 బంతుల్లో, 1x4, 3x6) పోరాడారు. ఆర్సీబీ బౌలర్లలో కర్ణ్ శర్మ (2/29), కామెరూన్ గ్రీన్ (2/12) రెండు వికెట్లతో సత్తాచాటారు.
అయితే విరాట్ కోహ్లి స్లో ఇన్నింగ్స్‌పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్, ఫించ్, ఆర్పీ సింగ్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఓపెనర్‌గా వచ్చి 15వ ఓవర్ వరకు క్రీజులో ఉన్న కోహ్లి 118 స్ట్రైక్‌రేటుతో పరుగులు చేశాడు. కోహ్లి మొదటి 18 బంతుల్లో 32 పరుగులు చేశాడు. కానీ ఆ తర్వాత ఎదుర్కొన్న 25 బంతుల్లో కేవలం 19 పరుగులే సాధించాడు. బౌండరీ ఏం సాధించలేదు.
'మిడిల్ ఓవర్లలో కోహ్లి టచ్ కోల్పోయినట్లుగా అనిపించింది. కచ్చితమైన స్కోరు తెలియదు కానీ, 31-32 పరుగుల నుంచి అతను ఔటైనంత వరకు ఒక్క బౌండరీ కూడా సాధించలేదు. అంతిమంగా ఇన్నింగ్స్‌ను తొలి బంతిని ఎదుర్కొన్న అతను 15వ ఓవర్‌లో ఔటై 118 స్ట్రైక్‌రేటుతో పరుగులు చేశాడు. కోహ్లి నుంచి ఇలాంటి ఆటను జట్టు ఆశించట్లేదు' - సునీల్ గవాస్కర్

'కోహ్లి ఇన్నింగ్స్‌ను ప్రత్యేకంగా చూసినప్పుడు అతని స్ట్రైక్‌రేటు తగ్గిపోయిందని అభిప్రాయపడవచ్చు. కానీ అక్కడ భాగస్వామ్యం పనిచేసింది. రజత్ పటిదార్ టాప్‌లో చెలరేగడానికి కోహ్లి సరైన పని చేశాడు. అంతిమంగా సత్తాచాటాలనుకుంటాం. కానీ అతను నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో మిగిలిపోయాడు'- ఆరోన్ ఫించ్
'పవర్‌ప్లేలో కోహ్లి తనను తాను మార్చుకున్నాడు. విరాట్ నుంచి అలాంటి షాట్లు ఆశించం. కానీ ప్రతి బంతిని అంచనా వేసి దాడికి దిగాడు. బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్‌ను డిస్టర్బ్ చేశాడు. అయితే వికెట్ పడిన తర్వాత కోహ్లి స్లో అయ్యాడు. సాధారణంగా కోహ్లి అంత స్లోగా ఆడడు. దాదాపు 24-25 బంతుల్లో ఒక్క బౌండరీ కూడా సాధించలేదు. ఇది జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కానీ ఓ ఎండ్‌లో కోహ్లి ఉండి, మరో ఎండ్‌లో రజత్ పటిదార్‌కు అవకాశాలు ఇవ్వడంతో వాళ్ల పని విజయవంతమైంది'- ఆర్పీ సింగ్