Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

'ఏంది నేను ఔటా?'.. విరాట్ రియాక్షన్ వైరల్.. అతడిపై ఫ్యాన్స్ గుస్సా

ఇంగ్లాండ్ తో జరిగిన రెండో వన్డేతో కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చేశాడు. కానీ కోహ్లీ మాత్రం పేలవ ఫామ్‌నే కొనసాగించాడు. ఈ మ్యాచ్ లో 8 బంతులు ఎదుర్కొన్న అతడు ఓ బౌండరీ బాది.. 5 పరుగులకే ఔట్ అయ్యాడు. అదిల్ రషీద్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌ ఫిల్‌ సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే కోహ్లీ ఔట్ అవ్వడానికి కారణం.. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అని క్రికెట్ అభిమానులు అంటున్నారు. అతడిపై విమర్శలు గుప్పిస్తున్నారు.

అసలేం జరిగిందంటే
కోహ్లీ ఔట్ అవ్వకముందు బంతిని డ్రైవ్‌ చేయగా.. అది కాస్త నేరుగా ఇంగ్లాండ్ సారథి జోస్ బట్లర్ దగ్గరకు వెళ్లింది. వెంటనే అతడు బంతిని వికెట్‌ కీపర్ వైపు విసరగా.. అది మళ్లీ విరాట్‌ కోహ్లీ వైపునకు దూసుకెళ్లింది. దీంతో కోహ్లీ తన ఏకాగ్రతను కోల్పోయాడని, అందుకే నెక్ట్స్ బాల్ కు ఔటయ్యాడని అభిమానులు విమర్శలు చేస్తున్నారు. బట్లర్ కావాలనే కోహ్లీవైపు బంతిని విసిరి ఏకాగ్రతను కోల్పోయేలా చేశాడని ఫ్యాన్ అంటున్నారు.

Virat Kohlis Shocked DRS dismissal Reaction Goes Viral fans slams Jos Buttler in IND vs ENG 2nd ODI

విరాట్ రియాక్షన్ వైరల్
ఈ మ్యాచ్ లో నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించిన కోహ్లీ.. అట్కిన్స‌న్ బౌలింగ్‌లో తనదైన స్ట్రైల్ కవర్ డ్రైవ్ తో బౌండరీ బాదాడు. కానీ ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌ ఫిల్‌ సాల్ట్‌కు క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు. అయితే మొదట అంపైర్ దీనిని‌ నాటౌట్‌ అని ప్రకటించగా.. ఇంగ్లాండ్ డీఆర్‌ఎస్ తీసుకుంది. రీప్లేలలో బంతి అల్ట్రా ఎడ్జ్ పై స్పైక్ కనిపించింది. దీంతో థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. ఆ సమయంలో విరాట్.. అల్ట్రా ఎడ్జ్ లో స్పైక్ చూసి ఇచ్చిన షాకింగ్ రియాక్షన్ వైరల్ గా మారింది. బంతి తన బ్యాట్‌ను తాకిందా అన్నట్లుగా చూశాడు. ప్రస్తుతం కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

Story first published: Monday, February 10, 2025, 10:06 [IST]
Other articles published on Feb 10, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+