For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీకి అసలైన క్రష్ ఎవరో తెలుసా?

Virat Kohli: క్రికెట్ అభిమానులు తమ అభిమాన ఆటగాళ్ల ఆటతీరుతో పాటు వ్యక్తిగత జీవితాల గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. అయితే మీ అభిమాన క్రికెటర్లకు ఏ బాలీవుడ్ నటులు, నటీమణలు ఇష్టమో మీకు తెలుసా? ఈ సమాచారం గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే మన క్రికెట్ దిగ్గజాలు ఎవరి అభిమానులో ఇప్పుడు తెలుసుకుందాం.

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల మధ్య లవ్ ఉన్నప్పటికీ..
భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మను ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే ఆయన అభిమాన నటి మాత్రం అనుష్క శర్మ కాదంట. మొదటి నుంచి విరాట్ కోహ్లీకి ఐశ్వర్య రాయ్ అంటే చాలా ఇష్టమట. బాలీవుడ్‌లో ఐశ్వర్య అంటే ఇష్టపడే కింగ్ కోహ్లీ.. హాలీవుడ్ లో ఏంజెలినా జోలీకి అభిమాని అని తెలిసింది.

Virat Kohli s Real Crush Isn t Anushka Find Out Which Bollywood Stars Are Our Cricketers Favorites

ధోనీ, యువీ అభిమాన తారలు వీరే..
భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి నటుడు అమితాబ్ బచ్చన్ అంటే చాలా ఇష్టమట. ఆయనతో పాటు ఇటీవల తనకు తలైవా రజినీకాంత్ అంటే చాలా ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇదిలా ఉండగా.. గతంలో ధోనీ, దీపికా పదుకొణె మధ్య సంబంధాలు ఉన్నాయని పుకార్లు వచ్చినప్పటికీ.. ఆయన తన అభిమాన నటి గురించి ఎప్పుడూ చెప్పకపోవడం గమనార్హం. మరోవైపు భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ కు నటి కాజోల్ అంటే చాలా అభిమానమట. యువీకి పలువురు నటీమణులతో సంబంధాలు ఉన్నాయని వార్తలు వచ్చినప్పటికీ.. ఆయన ఫేవరేట్ నటి మాత్రం కాజోలేనట.

రోహిత్, హార్దిక్ ఫేవరేట్ హీరోయిన్లు వీరే..
టీమిండియా దిగ్గజం రోహిత్ శర్మ నటి కరీనా కపూర్‌కు వీరాభిమాని ఆమె చాలా అందంగా ఉంటుందని, ఆమె నటించిన అన్ని సినిమాలను తాను చూశానని రోహిత్ గతంలో ఒక సందర్భంలో చెప్పారు.యువ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు నటి ఆలియా భట్ అంటే చాలా ఇష్టమట. ఆయన ఆమెకు పెద్ద అభిమాని అని సమాచారం.

మాస్టర్ బ్లాస్టర్‌కు ఇష్టమైన హీరోయిన్..
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్ కు అభిమాని. అలాగే, ఆయన నటుడు అమితాబ్ బచ్చన్‌ను కూడా ఎంతగానో ఇష్టపడతారు.

Story first published: Sunday, September 7, 2025, 17:39 [IST]
Other articles published on Sep 7, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+