Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

‘కోహ్లి కొత్త ఫ్రెండ్’ మెరుపు వేగంతో స్టన్నింగ్ క్యాచ్ (Video)

గత రెండు వారాలుగా క్రికెట్ మైదానంలో అబ్బురపరిచే ఫీల్డింగ్ విన్యాసాలు జరుగుతున్నాయి. మెరుపు వేగంతో క్యాచ్‌లను అందుకోవడం, గాల్లో పక్షిలా ఎగురుతూ బంతిని ఒడిసిపట్టడం సాధారణమే అనే రీతిలో ఆటగాళ్లు చెలరేగుతున్నారు. తాజాగా అఫ్గానిస్తాన్ ప్లేయర్ నవీనుల్ హక్ స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లితో గొడవపడి, తర్వాత ప్రపంచకప్‌లో సారీ చెప్పి ఫ్రెండ్ అయిపోయిన నవీనుల్.. క్రికెట్ అభిమానులకు సుపరిచితమే.

కాగా, సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్‌కు నవీనుల్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. గురువారం జోబర్గ్ సూపర్ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయిర్-2లో డర్బన్ 69 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. గెలుపులో నవీనుల్ కీలకపాత్ర పోషించాడు. అద్భుతమైన క్యాచ్‌తో కీలక బ్యాటర్ డుప్లూయ్‌ను ఔట్ చేయడమేగాక, రెండు వికెట్లు తీసి ప్రత్యర్థిజట్టను దెబ్బకొట్టాడు.

Virat Kohlis new friend taken a stunning catch with lightning speed in SA20

టోప్లే బౌలింగ్‌లో డుప్లూయ్ బౌండరీకి ట్రై చేశాడు. ఫీల్డర్ల మధ్య ఉన్న గ్యాప్‌ను చూసి షాట్ కొట్టాడు. కానీ మిడాఫ్‌లో ఉన్న నవీనుల్ మెరుపు వేగంతో రియాక్ట్ అయ్యి గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టాడు. ఈ స్టన్నింగ్ క్యాచ్‌ను చూసి బ్యాటర్ నిస్సహాయంగా మైదానాన్ని వీడాడు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో డుప్లూయ్ జట్టును గెలిపించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అలాంటి కీలక బ్యాటర్ ఆదిలోనే ఔటవ్వడం జోబర్గ్ సూపర్ కింగ్స్ ఎదురుదెబ్బగా మారింది. తర్వాత ఒత్తిడికి గురై వరుసగా వికెట్లు కోల్పోయింది.

టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న డర్బన్ సూపర్ జెయింట్స్ హెన్రిచ్ క్లాసెన్ (74; 30 బంతుల్లో, 3x4, 7x6) విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 211 పరుగులు చేసింది. ఓపెనర్లు బ్రీట్జ్‌కీ (12; 10 బంతుల్లో), డికాక్ (23; 17 బంతుల్లో) దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించారు. కానీ స్వల్పవ్యవధిలోనే ఇద్దరూ పెవిలియన్‌కు చేరారు. 12.1 ఓవర్లకు జెయింట్స్ స్కోరు 95/4 మాత్రమే. ఆ తర్వాత క్లాసెన్ ఊచకోత మొదలుపెట్టాడు. అతడికి తోడుగా వియాన్ మల్డర్ (50*; 23 బంతుల్లో) విధ్వంసం స‌ృష్టించాడు. దీంతో వీరిద్దరు 36 బంతుల్లోనే శతక భాగస్వామ్యం నెలకొల్పారు.

అనంతరం ఛేదనలో జోబర్గ్ సూపర్ కింగ్స్ 17.4 ఓవర్లలో 142 పరుగులకే కుప్పకూలింది. సూపర్ జెయింట్స్ బౌలర్లో జూనియర్ దలా నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. నవీనుల్, ప్రిటోరియస్ చెరో రెండు వికెట్లు తీశారు. కాగా, సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్, సూపర్ జెయింట్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ శనివారం జరగనుంది.

Story first published: Friday, February 9, 2024, 12:26 [IST]
Other articles published on Feb 9, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+