Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli-Anushka Sharma: కింగ్ కోహ్లీ సూపర్ సెంచరీ.. అనుష్క పోస్ట్ వైరల్

Virat Kohli-Anushka Sharma: ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ పై భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సిరీస్ లో సెమీఫైనల్స్ కు అర్హత సాధించిన తొలి జట్టుగా భారత జట్టు నిలిచింది. దీంతో పాకిస్థాన్ జట్టు దాదాపు మొదటి రౌండ్ నుంచే నిష్క్రమించినట్లే. గత కొంత కాలంగా పేలవ ఫామ్ తో విమర్శలు ఎదుర్కొన్న విరాట్ కోహ్లీ.. దాయాదిపై మ్యాచ్ లో అద్బుత ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించడంతో ఫ్యాన్స్ జోష్ లో ఉన్నారు.

ఆదివారం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ 241 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో భారత్ బరిలోకి దిగగా.. ఓపెనర్ రోహిత్ శర్మ 20 పరుగులకే ఔటయ్యాడు. ఐదో ఓవర్ ముగిసే సమయానికి రోహిత్ ఔట్ కాగా.. విరాట్ కోహ్లీ బరిలోకి రెండు భారీ భాగస్వామ్యాలను నిర్మించాడు. ఒకానొక సమయంలో పాక్ ఆటగాళ్లు స్పిన్ బౌలింగ్ చేసి జట్టును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారు. కానీ విరాట్ కోహ్లీ తన అనుభవంతో అన్నింటిని అధిగమించాడు.

Virat Kohli s Century and Anushka Sharma s Viral Post A Heartfelt Celebration

బాబర్ ఆజం లాగా బాల్స్ ను వృథా చేయకుండా విరాట్ కోహ్లీ చాలా సింగిల్స్ చేశాడు. దీంతో కోహ్లీ ఎలాంటి ఒత్తిడిలో చిక్కుకోలేదు. చివరి వరకు అజేయంగా నిలిచిన విరాట్ కోహ్లీ 111 బంతుల్లో సెంచరీ సాధించాడు. సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీ డ్రెస్సింగ్ రూమ్ వైపు చూసి చేయి ఊపాడు. అప్పుడు విరాట్ కోహ్లీ కెమెరా వైపు చూశాడు. విరాట్ కన్నుగీటడం ద్వారా తన భార్యపై ఉన్న ప్రేమను ప్రదర్శించాడు. బీసీసీఐ కొత్త నిబంధన ప్రకారం భార్యలు క్రికెట్ టోర్నమెంట్లలో పాల్గొనకుండా ఆంక్షలు విధించారు.

Virat Kohli s Century and Anushka Sharma s Viral Post A Heartfelt Celebration

మరో వైపు విరాట్ కోహ్లీ సెంచరీపై ఆనందం వ్యక్తం చేస్తూ అతడి సతీమణి, నటి అనుష్క శర్మ ఇన్ స్టా స్టోరీలో కోహ్లీ ఫోటోను పంచుకుంది. నిబంధన ప్రకారం స్టేడియానికి రాకుండానే.. ఇంటి నుంచే మ్యాచ్ ను వీక్షించింది విరాట్ సతీమణి అనుష్క శర్మ. టీవీలో విరాట్ సెంచరీ సంబరాలను ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ ఫోటోకు లవ్, హైఫై ఎమోజీలను జత చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. అంతకు ముందు విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన తర్వాత తన మెడలోని గొలుసుకు ఉన్న వెడ్డింగ్ రింగ్ ను ముద్దాదాడు. ప్రస్తుతం నెట్టింట అనుష్క పోస్ట్ వైరల్ గా మారింది.

Story first published: Monday, February 24, 2025, 9:31 [IST]
Other articles published on Feb 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+