న్యూజిలాండ్ పర్యటనలో సెహ్వాగ్ రికార్డుని కోహ్లీ బద్దలు కొట్టేనా?


హైదరాబాద్: ఆస్ట్రేలియా గడ్డపై చారిత్రక టెస్టు సిరిస్‌ను సొంతం చేసుకున్న కోహ్లీసేన ప్రస్తుతం న్యూజిలాండ్‌లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అనేక రికార్డులు ఊరిస్తున్నాయి. ఐదు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య బుధవారం నుంచి నేపియర్ వేదికగా తొలి వన్డే జరగనుంది.

కోహ్లీ రెండు సెంచరీలు సాధిస్తే
ఈ సిరిస్‌లో గనుక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండు సెంచరీలు సాధిస్తే.. న్యూజిలాండ్‌పై ఎక్కువ సెంచరీలు బాదిన భారత ఆటగాడిగా టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బద్దలు కొడతాడు. ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ న్యూజిలాండ్‌పై వన్డేల్లో ఐదు సెంచరీలు సాధించాడు

మరో నాలుగు పరుగులు చేస్తే
దీంతో పాటు విరాట్ కోహ్లీ మరో నాలుగు పరుగులు చేస్తే న్యూజిలాండ్‌పై వన్డేల్లో ఎక్కువ పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకుంటాడు. 50వ ఓవర్ల ఫార్మాట్‌లో భారత్ తరుపున కివీస్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ ఉన్నాడు. న్యూజిలాండ్‌పై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మొత్తం 1750 పరుగులు చేశాడు.

రెండో స్థానంలో సెహ్వాగ్
ఇందులో ఐదు సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. న్యూజిలాండ్‌పై విరాట్ కోహ్లీ 1514 పరుగులు(ఐదు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు) చేసిన మూడో స్థానంలో కొనసాగుతుండగా... సెహ్వాగ్ 1517 పరుగులతో(ఆరు సెంచరీలు, మూడు హాఫ్ సెంచరీలు) రెండో స్థానంలో ఉన్నాడు.

291 పరుగులు చేసిన కోహ్లీ
ఇప్పటి వరకూ న్యూజిలాండ్‌లో ఐదు వన్డేలాడిన కోహ్లీ 58.20 యావరేజితో ఒక సెంచరీతో పాటు 291 పరుగులు చేశాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో కెప్టెన్ విరాట్ కోహ్లీ 51 యావరేజితో 153 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications