చిన్నారుల కోసం కోహ్లీ, యువీ చిందు, ధోనీ పాట(వీడియో)
ముంబై: టీమిండియా క్రికెటర్లు ఇటీవల కాలంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా, పేద చిన్నారుల విద్య, యువతకు నైపుణ్య శిక్షణ కోసం ముంబైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి టీమిండియా క్రికెటర్లు హాజరయ్యారు.
భారత స్టార్ బ్యాట్స్‌మన్, పరుగుల యంత్రం విరాట్‌కోహ్లీ.. తన ఫౌండేషన్‌తో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చిన్నారులు, యువత కోసం ముంబైలో స్మైల్ ఫౌండేషన్ నిర్వహించిన చారిటీ గాలా డిన్నర్‌కు కోహ్లీ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

కోహ్లీతో పాటు పరిమిత ఓవర్ల(వన్డే) కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్, అజింక్య రహానె, హార్దిక్ పాండ్యా, ఉమేష్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. చిన్నారులతో సరదాగా గడిపారు.
ఈ సందర్భంగా కోహ్లీ, యువరాజ్, హార్దిక్‌పాండ్యా తమ స్టెప్పులతో అలరించారు. కాగా, ధోనీని డాన్స్ చేయాలని వ్యాఖ్యాత కోరగా.. తాను బాగా డాన్స్ చేయలేనని చెప్పి.. తనకు ఇష్టమైన హిందీ పాటను పాడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications