
35 సార్లు టాస్ ఓడిపోయాడు
62 మ్యాచుల్లో విరాట్ కోహ్లీ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో 35 సార్లు టాస్ ఓడిపోయాడు. దీంతో టెస్టు క్రికెట్‌లో అత్యధిక సార్లు టాస్ ఓడిన భారత కెప్టెన్‌గా కోహ్లీ రికార్డుల్లో నిలిచాడు. మాజీ సారథి ఎంఎస్ ధోనీ 60 టెస్ట్ మ్యాచుల్లో 34 సార్లు టాస్ ఓడి రెండో స్థానంలో ఉన్నాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు ముందు కోహ్లీ, ధోనీ ఇద్దరూ 34 సార్లు టాస్ ఓడి అగ్రస్థానంలో ఉన్నారు. టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ 49 మ్యాచుల్లో 29 సార్లు టాస్ ఓడాడు. లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ 47 మ్యాచుల్లో 25, ఎంకే పటౌడీ 47 మ్యాచుల్లో 27 సార్లు టాస్ ఓడిపోయారు.

అత్యధిక సార్లు డకౌట్
తొలి టెస్టులో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన విరాట్ కోహ్లీ.. టెస్టు క్రికెట్‌లో అత్యధిక సార్లు డకౌటైన టీమిండియా కెప్టెన్‌గా కూడా రికార్డుల్లో నిలిచాడు. టెస్టు కెరీర్‌లో కోహ్లీ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగడం ఇది ఐదోసారి.2011-12లో ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగిన కోహ్లీ.. 2014లో ఇంగ్లండ్‌పై, 2018లో ఇంగ్లండ్‌పై, 2019లో వెస్టిండీస్‌పై, 2021లో మళ్లీ ఇంగ్లండ్‌పైనే మొదటి బంతికే పెవిలియన్ చేరాడు.
మొత్తంగా టెస్టు కెరీర్‌లో కెప్టెన్‌గా కోహ్లీ డకౌటవడం ఇది తొమ్మిదోసారి. దీంతో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ 8 డకౌట్ల రికార్డ్‌ని అతడు బ్రేక్ చేశాడు. ఎంకే పటౌడీ 7 డకౌట్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు.

అండర్సన్ బౌలింగ్‌లో ఇదే తొలిసారి
ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో 2014 తర్వాత టెస్టుల్లో విరాట్ కోహ్లీ ఔటవడం ఇదే తొలిసారి. 2014లో ఇంగ్లండ్ పర్యటనకి వెళ్లిన కోహ్లీని జిమ్మీ ఏకంగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లో ఔట్ చేశాడు. దాంతో ఐదు టెస్టుల్లో కలిపి కోహ్లీ చేసిన పరుగులు 134 మాత్రమే. ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా పడిన బంతుల్ని వెంటాడుతూ అప్పట్లో వికెట్ చేజార్చుకున్న కోహ్లీ.. ఆ తర్వాత బలహీనతని దిద్దుకున్నాడు.
2018 పర్యటనలో దుమ్మురేపాడు. 5 టెస్ట్‌ల్లో 59.30 సగటుతో 593 రన్స్ చేశాడు. ఇందులో 2 సెంచరీలు కూడా ఉన్నాయి. కానీ సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ అండర్సన్‌కి వికెట్ సమర్పించుకున్నాడు కోహ్లీ.

గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్న కోహ్లీ
విరాట్ కోహ్లీ గత ఏడాదిన్నర కాలంగా బ్యాటింగ్‌లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై చివరిసారిగా సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కొన్నిసార్లు మాత్రమే 70, అంతకుమించిన పరుగులు చేశాడు. టెస్టులు, వన్డేల్లో కలిపి ఇప్పటికే 70 శతకాలు సాధించిన కోహ్లీ.. ఇటీవల ముగిసిన టెస్ట్ ఛాంపియన్‌షిఫ్ ఫైనల్లోనూ పూర్తిగా విఫలమయ్యాడు.
ఇంగ్లండ్‌తో ప్రారంభం అయిన టెస్ట్ సిరీస్‌లోనైనా 71వ శతకం అందుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. అభిమానుల ఆశలను అతడు వమ్ము చేశాడు. ఇంకా నాలుగు టెస్టులు ఉన్న నేపథ్యంలో కోహ్లీ పుంజుకునే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications

ఎంఎస్ ధోనీకి షాక్.. బ్లూ టిక్‌ను తీసేసిన ట్విట్టర్! ఇంతకు ఈ బ్లూ టిక్ అంటే ఏంటి.. ఎందుకు తొలగిస్తుందో తెలుసా?