Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆసీస్ సిరిస్‌ను కాపాడుకోవడం కష్టమేనన్న గంగూలీ

హైదరాబాద్: నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత పర్యటకు వచ్చిన ఆస్ట్రేలియా నుంచి గట్టి పోటీ లభిస్తుందని తాను అనుకోవడం లేదని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. పూణెలో జరుగుతున్న తొలి టెస్టులో ఆసీస్ ఓటమి పాలైతే, ఇక వారు సిరిస్‌ను కాపాడు కోవడం కష్టమేనని అన్నాడు.

ఆసీస్‌కు వైట్ వాష్ తప్పకపోవచ్చు

ఆసీస్‌కు వైట్ వాష్ తప్పకపోవచ్చు

తొలిసారిగా ఓ టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న పూణె పిచ్ రాను రాను స్పిన్ బౌలింగ్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో ఆస్ట్రేలియా ఎంత వరకు బరిలో నిలబడతుందనే విషయం తెలియాల్సి ఉందని గంగూలీ అన్నాడు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడేందుకు భారత్‌కు వచ్చిన ఆసీస్‌కు వైట్ వాష్ తప్పకపోవచ్చని గంగూలీ అన్నాడు.

ఆసీస్‌ను ఎప్పుడూ గౌరవిస్తాం

ఆసీస్‌ను ఎప్పుడూ గౌరవిస్తాం

'ఆసీస్‌ను ఎప్పుడూ గౌరవిస్తాం. ఆ జట్టు కొన్ని సంవత్సరాల నుంచి వారు చాంపియన్ తరహాలో టెస్టు క్రికెట్ ఆడుతోంది. గత 30-40ఏళ్లలో నేను చూసిన అత్యుత్తమ జట్లలో ఆసీస్ ఒకటి. కానీ ఇక్కడ స్పిన్ ట్రాక్‌పై భారత్‌ను ఆసీస్ ఎలా అడ్డుకుంటుందనేదే ప్రధాన ప్రశ్న. కోహ్లీ సేనను స్వదేశంలో ఓడించడం ఆసీస్‌కు అంత ఈజీ కాదు' అని గంగూలీ అన్నాడు.

ఒకే ఒక్క ఆటగాడు స్మిత్ మాత్రమే

ఒకే ఒక్క ఆటగాడు స్మిత్ మాత్రమే

భారత్ స్పిన్‌ను సమర్ధవంతంగా ఎదుర్కోగలిగే ఒకే ఒక్క ఆటగాడు స్మిత్ మాత్రమేనని గంగూలీ చెప్పాడు. స్మిత్‌కు స్పిన్ పై మంచి అవగాహన ఉందని, భారత్‌కు స్మిత్ నుంచే గట్టి పోటీ ఉండవచ్చని అన్నాడు. ఈ స్పిన్ పిచ్‌లపై డేవిడ్ వార్నర్ భారీ స్కోర్లు చేస్తాడని తాను అనుకోవడం లేదని గంగూలీ చెప్పాడు.

ఐపీఎల్ పిచ్‌లకు, టెస్టు పిచ్‌లకు చాలా తేడా

ఐపీఎల్ పిచ్‌లకు, టెస్టు పిచ్‌లకు చాలా తేడా

ఒక్క మాటలో చెప్పాలంటే ఐపీఎల్ పిచ్‌లకు ప్రస్తుతం జరుగుతున్న టెస్టు పిచ్‌లకు చాలా తేడా ఉంటుందని అన్నాడు. ఐపీఎల్ పిచ్‌లు ఫ్లాట్‌గా ఉండటంతో పాటు గ్రౌండ్‌లు చిన్నవిగా ఉంటాయని చెప్పాడు. దాంతో మంచి స్కోర్లు చేసే అవకాశం ఉంటుందని గంగూలీ చెప్పుకొచ్చాడు. అశ్విన్, జడేజాల స్పిన్‌ను వార్నర్ ఎదుర్కోగలడని తాను కచ్చితంగా చెప్పలేనని గంగూలీ అన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+