హైదరాబాద్: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ జూన్ 24న ఇంగ్లాండ్‌లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్‌మీడియా ద్వారా భారత మహిళల జట్టుకి శుభాకాంక్షలు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోని బీసీసీఐ తన ట్విట్టర్‌లో పోస్టు చేసింది.
వరల్డ్ కప్ ఆడుతోన్న భారత మహిళల జట్టుకి అభినందనలు తెలుపుతూ, టోర్నీలో అద్భుతంగా రాణించాలని ఈ సందర్భంగా కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. 'భారత్ తలపడే మ్యాచ్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌లో పాల్గొంటున్న భారత జట్టుకి ఇవే నా శుభాకాంక్షలు' అని కోహ్లీ తెలిపాడు.

కోహ్లీతో పాటు భారత ఆటగాళ్లు పాండ్యా, భువనేశ్వర్ కుమార్, దినేశ్ కార్తీక్ తదితరులు భారత మహిళల జట్టుకి శుభాకాంక్షలు తెలిపారు. టోర్నీలో భాగంగా భారత్ తన తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లాండ్‌తో శనివారం తలపడనుంది. ఇదిలా ఉంటే కోహ్లీసేన ప్రస్తుతం వెస్టిండిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ పర్యనటలో వెస్టిండిస్‌తో టీమిండియా ఐదు వన్డేల సిరీస్‌తో పాటు ఒక టీ20 కూడా ఆడనుంది. ఇందులో భాగంగా శుక్రవారం తొలి వన్డేలో ఆడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ శుక్రవారం సాయంత్రం 6.30గంటలకు ప్రారంభం కానుంది.