Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బ్రదర్‌.. 40 ఏళ్లకు ఇగ ఏడాదే: కోహ్లీ

Virat Kohli wishes elder brother Vikas Kohli on his 39th birthday

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉంటాడన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మ్యాచ్, తనకు సంబందించిన విషయాలను ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంటాడు. ఇక లాక్‌డౌన్ నేపథ్యంలో పలువురు ఆటగాళ్లతో కోహ్లీ లైవ్ చాట్‌లు నిర్వహించి పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు. ఏ ఆటగాడి పుట్టినరోజు అయినా.. తనదైన స్టయిల్లో శుభాకాంక్షలు చెప్పాడు. తాజాగా తన అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షల్ని విరాట్ విన్నూత్నంగా తెలియజేశాడు.

హ్యాపీ బర్త్‌డే బిరదార్:

హ్యాపీ బర్త్‌డే బిరదార్:

ఈ రోజు (జూన్ ‌3) విరాట్‌ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ 39వ బర్త్‌డే సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపాడు. 'హ్యాపీ బర్త్‌డే బిరదార్‌.. 40 ఏళ్లకు ఇగ ఏడాదే ఉంది' అని ఇన్‌స్టాగ్రామ్‌లో శుభాకాంక్షలు తెలియజేశాడు. తమ చిన్ననాటి ఫోటోను విరాట్ షేర్‌ చేశాడు. ఒకవైపు విరాట్‌ కోహ్లీ తన క్రికెట్‌ కెరీర్‌తో బిజీగా ఉండగా.. వికాస్ కోహ్లీ మాత్రం తన రెస్టారెంట్‌ వ్యాపారాలను చూసుకుంటున్నాడు.

ఢిల్లీలో న్యూవా రెస్టారెంట్‌:

ఢిల్లీలో న్యూవా రెస్టారెంట్‌:

వికాస్ కోహ్లీ ఢిల్లీలో న్యూవా రెస్టారెంట్‌ను నడుపుతున్నాడు. దీనికి విరాట్‌ కోహ్లీ ప్రమోటర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఒక సక్సెస్‌ఫుల్‌ వ్యాపారవేత్తగా కొనసాగుతున్న వికాస్.. పలుమార్లు ఫుడ్‌ అవార్డులను కూడా అందుకున్నాడు. 2018లో ఈ రెస్టారెంట్‌ ఫుడ్‌ అవార్డును గెలుచుకుంది. వికాస్ భార్య పేరు చేత్న. వికాస్-చేత్నలకు ఒక కుమారుడు. అతని పేరు ఆర్యవీర్‌.

మ్యాచ్‌లు వీక్షించడానికి స్టేడియాలకు:

మ్యాచ్‌లు వీక్షించడానికి స్టేడియాలకు:

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ ‌(ఐపీఎల్‌) జరుగుతున్న సమయంలో వికాస్ కోహ్లీ‌ మ్యాచ్‌లను వీక్షించడానికి ఎక్కువగా స్టేడియాలకు వస్తాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు ఆడుతున్న మ్యాచ్‌లకు వికాస్ హాజరవుతూ ఉంటాడు. ఆ సమయంలో అతడు తమ్ముడి ఆట చూసి ఎంతో ఆనందించేవాడు. ఇక ప్రస్తుతం ఐపీఎల్ 2020 వాయిదా పడడంతో.. విరాట్ ఇంట్లోనే ఉంటూ ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటున్నాడు.

70 సెంచరీలు:

70 సెంచరీలు:

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 86 టెస్టులాడి 53.63 సగటుతో 7,240 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు, 7 డబుల్ సెంచరీలు, 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 248 వన్డేల్లో 59.34 సగటుతో 11,867 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 58 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 81 టీ20లలో 50.8 సగటుతో 2,794 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 21,901 పరుగులు చేశాడు.

Story first published: Wednesday, June 3, 2020, 20:20 [IST]
Other articles published on Jun 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+