For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అనుష్క పుట్టినరోజుకైనా బెంగళూరును కోహ్లీ గెలిపిస్తాడా?

Virat Kohli wishes Anushka Sharma on 30th birthday: Happy B’day my love

హైదరాబాద్: ప్రేమించి పెళ్లి చేసుకున్న లవర్ బాయ్.. విరాట్ కోహ్లీ. తన సతీమణి అనుష్క శర్మ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. కేక్ కట్ చేసిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ విధంగా బాలీవుడ్ నటి అనుష్క శర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. మంగళవారం అనుష్క 30వ పుట్టినరోజును జరుపుకుంటోంది. విరాట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో బర్త్‌డే విషెస్ చెబుతూ.. అనుష్కను పొగడ్తలతో ముంచెత్తాడు.

తమ హోటల్ రూమ్‌ను విభిన్న రకాల పూలతో అలంకరించి వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన అనంతరం అనుష్కకు కేక్ తినిపిస్తున్న ఫొటోను పోస్ట్ చేశాడు. బెంగళూరులో ఆర్‌సీబీ తరపున కోహ్లీ ఆడుతున్న మ్యాచ్‌లకు అనుష్క శర్మ హాజరై జట్టుకు మద్దతుతో పాటు అభిమానులను ఉత్సాహపరుస్తోంది. ప్రస్తుతం విరుష్క బెంగళూరులోనే ఉంది.

ఇవాళైనా బెంగళూరును విజయం వరించేనా:
మంగళవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ మధ్య చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. జట్టు నిండా స్టార్ హిట్టర్లున్నా, బౌలింగ్ దళం పటిష్ఠంగా లేకపోవడంతో కోహ్లీసేన వరుస పరాజయాలను ఎదుర్కొంటోంది. ఆశించిన స్థాయిలో విజయాలు లేకపోవడంతో లీగ్ యాజమాన్యాన్ని, అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే.

కోహ్లీ పెట్టిన ఈ పోస్టుకి కొందరు శుభాకాంక్షలు తెలుపుతుంటే, మరి కొందరు ఐపీఎల్ మ్యాచ్ కూడా గెలవాలి అంటూ ఉత్సాహాన్నిస్తున్నారు. నేటి మ్యాచ్‌లో గెలుపొంది ఆ విజయాన్ని అనుష్కకు బర్త్‌డే గిఫ్ట్‌గా ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.

Story first published: Tuesday, May 1, 2018, 12:12 [IST]
Other articles published on May 1, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+