ఆసియా కప్ టోర్నీలో అప్డేటెడ్ బ్యాట్ పట్టనున్న విరాట్ కోహ్లీ.. ప్రత్యేకతలతో పాటు స్టైలిష్ లుక్‌తో బ్యాట్..!

స్టార్ ఇండియన్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఇటీవల ఫామ్ కోల్పోయి బ్యాటింగ్లో తీవ్ర ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. అతని పేలవ ఫామ్ వల్ల అతన్ని జట్టులో నుంచి తొలగించాలంటూ పలువురు ప్రముఖులు సైతం విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం క్రికెట్లో విరాట్ కోహ్లీ ఫామే హాట్ టాపిక్. గత నెలలో ఇంగ్లాండ్ పర్యటనలో చివరిసారిగా విరాట్ భారత్ తరఫున ఆడాడు.
ఆ పర్యటనలో విరాట్ పూర్తిగా విఫలమయ్యాడు. కొన్ని రోజులుగా పూర్తి విరామంలో ఉన్న కోహ్లీ.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో జరిగే ఆసియా కప్ 2022 కోసం మళ్లీ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ దఫా కోహ్లీ తప్పకుండా ఫామ్ పుంజుకుంటాడని అంతా ఆశిస్తున్నారు.

కోహ్లీ కోసం ప్రత్యేక బ్యాట్
ఈ క్రమంలో కోహ్లీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ఆసియా కప్‌కు ముందు కోహ్లీ తన బ్యాట్ మార్చబోతున్నాడు. ఓ ప్రత్యేక తరహా బ్యాట్ ఆసియాకప్ టోర్నీలో వాడనున్నాడు. ఆగస్ట్ 27 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఈ మెగా టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ కోసం ప్రముఖ బ్యాట్ల తయారీ సంస్థ MRF ప్రత్యేక గోల్డ్ విజార్డ్ క్వాలిటీ బ్యాట్‌ని స్పాన్సర్ చేస్తోంది. ఈ బ్యాట్ కాస్ట్‌లీ ఇంగ్లీష్ విల్లో కలపతో తయారు చేయబడింది. దీని ధర రూ.22,000.
గట్టి గ్రిప్‌తో సాలిడ్ లుక్‌తో
ఈ బ్యాట్ సాధారణ క్రికెట్ బ్యాట్ పరిమాణాలనే కలిగి ఉన్నప్పటికీ.. దీని వెయిట్ కాస్త తక్కువగా ఉండనుంది. ఇకపోతే ఈ బ్యాట్ లుక్ కూడా బాగుంటుంది. గ్రిప్, ఇతర విషయాల్లోనూ మిగతా బ్యాట్లతో పోల్చితే కాస్త గట్టి గ్రిప్ లభిస్తుంది. యూజువల్ గ్రిప్‌తో పాటు బ్యాట్ దీనికి సెపరేట్ గ్రిప్ ప్యాడ్ కూడా ఉంటుందటా.. ఏ బ్యాట్ ధర అయినా బ్యాట్‌లో ఉపయోగించే గ్రెయిన్ల సంఖ్యకు లేదా బ్యాట్ విల్లో సర్ఫేస్‌పై ఉన్న లైన్స్‌ను బట్టి ఉంటుంది. లైన్స్, గ్రెయిన్లు బ్యాట్ స్ట్రోక్‌ను సూచిస్తాయి. క్రికెటర్లు సాధారణంగా 6-12 గ్రెయిన్లు కలిగి ఉన్న బ్యాట్ ఉపయోగిస్తారు.

8ఏళ్ల కాలానికి గాను రూ.100కోట్ల డీల్
కోహ్లీ 8-12 గ్రెయిన్ల మధ్య ఉండే విల్లో బ్యాట్లనే ప్రిపేర్ చేస్తాడు. ఎంఆర్ఎఫ్ బ్యాట్ కంపెనీ.. కోహ్లీకి స్పాన్సర్‌గా ఉండడంతో పాటు.. ఆ కంపెనీ కోహ్లీకి పెద్ద మొత్తంలో బ్రాండ్ వాల్యూ మేరకు మనీ చెల్లిస్తుంది. 2017లో 8ఏళ్ల కాలానికి గాను రూ.100కోట్ల మేర కోహ్లీతో డీల్ కుదుర్చుకుంది. అంటే సంవత్సరానికి కోహ్లీకి రూ.12.5కోట్లు ఆ కంపెనీ చెల్లిస్తుంది. ఇక మరో భారత బ్యాటర్ రోహిత్ శర్మకు ప్రస్తుతం సీయట్ కంపెనీ స్పాన్సర్‌గా ఉంది. ఈ రెండు కంపెనీలు స్వతహాగా టైర్ల కంపెనీలు అయినప్పటికీ... వీటికంటూ బ్యాట్ల తయారీ విభాగం కూడా మంచి రెవెన్యూ జెనరేటెడ్ సోర్స్‌గా ఉంది. ఇకపోతే ఎస్ఎస్, రీబక్, కుకబుర, అడిడాస్, నైక్, ఎన్బీ, బాస్, జీఎం, తదితర బ్యాట్ల కంపెనీలు ప్రస్తుతం ఇండియాలో బాగా సేల్ అవుతున్నాయి.

క్రికెట్ బ్యాట్ల బ్రాండ్స్ - గుర్తుకొచ్చే ప్లేయర్లు
ఎంఆర్ఎఫ్ - విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, బ్రియాన్ లారా, స్టీవ్ వా
స్పార్టన్ - ఎంఎస్ ధోనీ (రీబాక్, బాస్ బ్యాట్లను కూడా ధోనీ ఉపయోగించాడు)
ఎస్ఎస్ - వీవీఎస్ లక్ష్మణ్ (గతంలో శిఖర్ ధావన్ కూడా వాడేవాడు)
రీబాక్ - ధోనీ, యువరాజ్, రోహిత్, ఉతప్ప, గౌతం గంభీర్
సీయట్ - శుభ్ మాన్ గిల్, రోహిత్ శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్
హీరో హోండా - యువరాజ్ సింగ్ (ప్రస్తుతం హీరో హోండా కంపెనీ బ్యాట్లను తయారు చేయట్లేదు.)
బ్రిటానియా - రాహుల్ ద్రావిడ్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications