Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: ఈ ఏడాది సచిన్‌ను దాటేస్తాడు.. విరాట్ కోహ్లీపై సంచలన వ్యాఖ్యలు

 Virat Kohli will surpass Sachin this year

టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ ఈ ఏడాదిలోనే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్‌ను దాటేస్తాడా? పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మరో చరిత్ర సృష్టిస్తాడా? అంటే అవుననే అంటున్నాడు టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్. రోహిత్ శర్మ, రాబిన్ ఊతప్ప వంటి ఆటగాళ్లు మళ్లీ ఫామ్ అందుకోవడంలో బంగర్ పాత్ర చాలా కీలకమన్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన బంగర్.. కోహ్లీపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

కోహ్లీ ముందు కొత్త టార్గెట్..

కోహ్లీ ముందు కొత్త టార్గెట్..

చాలా గ్యాప్ తర్వాత మళ్లీ వైట్ బాల్ క్రికెట్‌లో ఫామ్ అందుకున్నాడు కోహ్లీ. ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై సెంచరీ బాదాడు. ఆ తర్వాత టీ20 వరల్డ్ కప్‌లో అద్భుతమైన ఫామ్ కొనసాగించి, ఆ టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివరగా బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కూడా సెంచరీ బాదేసి 'కింగ్ ఈజ్ బ్యాక్' అని ఘనంగా ప్రకటించాడు. బంగ్లాపై చేసిన సెంచరీ.. కోహ్లీ కెరీర్‌లో 72వది. అదే సమయంలో వన్డేల్లో అది కోహ్లీకి 44వ సెంచరీ. ఇప్పటి వరకు వన్డేల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ పేరిట రికార్డు ఉంది.

సచిన్ రికార్డుకు సమీపంలో..

సచిన్ రికార్డుకు సమీపంలో..

తన కెరీర్‌లో సచిన్ టెండూల్కర్ వన్డేల్లోనే ఏకంగా 49 సెంచరీలు నమోదు చేశాడు. ఈ నెంబర్‌ను మళ్లీ ఎవరూ అందుకోలేకపోయారు. కోహ్లీ ఒక్కడే దానికి చేరువలో ఉన్నాడు. వైట్ బాల్ క్రికెట్‌లో మళ్లీ ఫామ్ అందుకున్న కోహ్లీకి 2023 సంవత్సరం సరిగ్గా సరిపోతుందని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు టీమిండియా ఎన్నడూ ఆడనంతగా ఈ సంవత్సరంలో వన్డే మ్యాచులు ఆడనుంది. దీంతో కోహ్లీ ఈ ఏడాదిలోనే సులభంగా ఆరు సెంచరీలు బాదేసి, సచిన్‌ రికార్డు బద్దలు కొట్టేస్తాడని అభిమానులు భావిస్తున్నారు.

ఈ ఏడాది బోలెడు మ్యాచులు..

ఈ ఏడాది బోలెడు మ్యాచులు..

సంజయ్ బంగర్ కూడా కోహ్లీ ఈ ఫీట్ సాధిస్తాడనే నమ్ముతున్నాడు. 'కోహ్లీ ఇప్పటి వరకు చాలా వేగంగా దూసుకొచ్చాడు. ఇంత తక్కువ కాలంలో ఇంత గొప్ప ఘనత సాధించడం చిన్న విషయం కాదు. అయితే ఈ ఏడాదిలోనే ఈ ఫీట్ సాధిస్తాడా? అనేది ప్రశ్న. ఈ సంవత్సరం టీమిండియా 26-27 వన్డే మ్యాచులు ఆడుతుంది.

వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ చేరితే అది అదనం. కాబట్టి ఆ మైలురాయిని ఈ ఏడాదిలోనే కోహ్లీ అందుకోవడానికి చాలా ఛాన్సులు ఉన్నాయి' అని బంగర్ అభిప్రాయపడ్డాడు. ఫ్యాన్స్ కూడా మళ్లీ ఫామ్ అందుకున్న కోహ్లీ ఒక రేంజ్‌లో చెలరేగుతాడని భావిస్తున్నారు.

అంత ఈజీ కాదు..

అంత ఈజీ కాదు..

అయితే ఈ ఫీట్ సాధించడం కోహ్లీకి అంత ఈజీ కాదని బంగర్ అభిప్రాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో సెంచరీ సాధించిన కోహ్లీ.. ఆ తర్వాత రెండు టెస్టుల్లో పెద్దగా ఆకట్టుకోలేదు. మూడు ఫార్మాట్లలో ఆడుతున్న కోహ్లీ వంటి ఆటగాళ్లు అడ్జస్ట్ అవడం కష్టమని బంగర్ అన్నాడు. 'కోహ్లీ మూడు ఫార్మాట్లూ ఆడుతున్నాడు కాబట్టి ఈ ఫీట్ సాధించాలంటే ఒక్క బంతికి కూడా కాన్‌సన్‌ట్రేషన్ మిస్ కాకూడదు.

మధ్య మధ్యలో బ్రేకులు తీసుకోక తప్పదు. ప్రస్తుతానికి టీ20 మ్యాచుల సమయంలో బ్రేక్ తీసుకుంటాడని అనుకుంటున్నా. వన్డేల్లో అయితే బ్రేకులు తీసుకోవడం కుదరదని నా అభిప్రాయం. కచ్చితంగా సచిన్ రికార్డు బద్దలు కొట్టకపోయినా అక్కడి వరకు అయితే వెళ్లడం ఖాయమని అనుకుంటున్నా' అని చెప్పాడు. మరి కొత్త సంవత్సరంలో కోహ్లీ ఏ రేంజ్‌లో ఆడతాడో చూడాలి.

Story first published: Monday, January 2, 2023, 14:32 [IST]
Other articles published on Jan 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+