సచిన్ కంటే కోహ్లీ బ్యాటింగ్ సగటే ఎక్కువ, ఖచ్చితంగా 62 సెంచరీలు ..: సెహ్వాగ్

హైదరాబాద్: నామమాత్రంగా జరగాల్సిన మ్యాచ్‌ను రికార్డు స్థాయిలో గెలిచేలా చేసిన టీమిండియా కెప్టెన్ కోహ్లీని పొగడ్తలు ముంచెస్తున్నాయి. సెహ్వాగ్ ఏకంగా అతను వన్డే సెంచరీలు ఎన్ని చేయగలడో... కూడా చెప్పేస్తున్నాడు. కోహ్లీ తన ఫామ్‌తో క్రికెట్ ప్రేమికుల్ని ప్రతి మ్యాచ్‌లోనూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు.
దక్షిణాఫ్రికా సిరీస్‌లో సెంచరీలతో చెలరేగుతున్న తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. ఇప్పటికే క్రికెట్ లెజెండ్ సచిన్‌ను కూడా దాటేస్తాడంటూ వార్తలు వస్తూనే ఉన్నాయి. మరి కోహ్లీ వన్డేల్లో ఎన్ని సెంచరీలు సాధిస్తాడు. ఈ ప్రశ్నకు ఇండియన్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ సమాధానం ఇచ్చాడు.
కోహ్లీ తన కెరీర్ మొత్తంలో 62 వన్డే సెంచరీలు నమోదు చేస్తాడని వీరూ తెలిపాడు. ట్విట్టర్‌లో ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు తనదైన స్టయిల్లో విశ్లేషణ చేశాడు. భవిష్యత్తు అంచనాల ప్రకారం కోహ్లీ వన్డేల్లో మొత్తం 62 సెంచరీలు చేస్తాడని వీరూ తేల్చేశాడు. ఫామ్, ఫిట్‌నెస్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ అంచనా వేస్తున్నట్లు వీరూ తెలిపాడు.
463 వన్డేలు ఆడిన సచిన్.. 49 సెంచరీలు, 96 అర్థ సెంచరీలు చేశాడు. ప్రస్తుతం కోహ్లీ 208 వన్డేలు ఆడాడు. అందులో 35 సెంచరీలు చేశాడు. బ్యాటింగ్ సగటు కూడా సచిన్ కన్నా కోహ్లీదే బెస్ట్‌గా ఉంది. ఒక వన్డేల్లో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీయే అని ఇంగ్లండ్ మాజీ ప్లేయర్ మైఖేల్ వాన్ కూడా ఆసక్తికర కామెంట్ చేయడం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications