For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎవరెస్ట్ అంత ఎత్తున విరాట్: ఒక్క టెస్ట్ మ్యాచ్..ఎందరో క్రికెటర్లకు లైఫ్‌లాంగ్ మెమరీ

Virat Kohli will need to score 63 runs to become the first ever to reach 23,000 international runs

లండన్: భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్‌ ఇంకాస్సేపట్లో ఆరంభం కానుంది. భారత కాలమానం ప్రకారం.. 3:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. మొత్తం అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఇది. ఇందులో విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ముందంజలో ఉంటోంది. 1-0 స్కోర్‌తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్.. చివరిరోజు వర్షం వల్ల డ్రాగా ముగియగా.. రెండో మ్యాచ్‌ను భారత్ సొంతం చేసుకుంది. భారీ తేడాతో ఇంగ్లాండ్ జట్టును సొంతగడ్డపై మట్టి కరిపించింది. ఇక అదే ఊపుతో మూడో మ్యాచ్‌కు సన్నధ్దమైంది.

కొన్ని ల్యాండ్ మార్క్స్ ఖాయమౌతాయా?

కొన్ని ల్యాండ్ మార్క్స్ ఖాయమౌతాయా?

మూడో టెస్ట్ మ్యాచ్ కొన్ని చిరస్మరణీయమైన రికార్డులను అందించడానికి రెడీ అవుతోంది. ఈ మ్యాచ్‌లో అనుకున్నది అనుకున్నట్లుగా ఆడగలిగితే- పలువురు క్రికెటర్లు సరికొత్త రికార్డులను నెలకొల్పగలుగుతారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో కొన్ని అరుదైన ల్యాండ్‌మార్క్‌ వారు అందుకోగలుగుతారు. టెస్ట్ క్రికెట్ ఉన్నన్ని రోజులు వారి పేర్లు కూడా చిరస్థాయిగా నిలిచిపోతాయి. టీమిండియాతో పాటు ఒకరిద్దరు ఇంగ్లాండ్ ప్లేయర్లు కూడా అలాంటి రికార్డులకు చేరువగా ఉన్నారు.

లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే..?

లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే..?

టెస్ట్ క్రికెట్ హిస్టరీలో అరుదైన మైలురాళ్లను అందుకునే క్రికెటర్ల జాబితాలో టాప్ ప్లేస్‌లో ఉన్న ప్లేయర్.. విరాట్ కోహ్లీ.. టీమిండియా కేప్టెన్. టెస్టుల్లో విరాట్ కోహ్లీ ఇంకో 63 పరుగులు చేస్తే..ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకుంటాడు. 23,000 పరుగులను పూర్తి చేసుకుంటాడు. వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 ఇంటర్నేషనల్స్, టెస్ట్ మ్యాచుల్లో కలిపి విరాట్ కోహ్లీ ఇప్పటిదాకా 22,937 పరుగులు చేశాడు. అన్ని ఫార్మట్లలో కలిపి 487 ఇన్నింగులను ఆడాడతను ఇప్పటిదాకా. 500 ఇన్నింగుల కంటే ముందే 23,000 పరుగులను చేరుకోవడానికి పెద్దగా కష్టపడనక్కర్లేదు.

ఇంగ్లాండ్ గడ్డపైనే..

ఇంగ్లాండ్ గడ్డపైనే..

ఇంగ్లాండ్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడుతోండటం..ఇంకా మూడు టెస్టులు మిగిలి ఉండటం వల్ల 63 పరుగులు చేయడం విరాట్ కోహ్లీకి పెద్ద కష్టమైన పనేమీ కాదు. కుదురుగా ఆడితే.. ఒక్క ఇన్నింగ్ చాలు అతనికి.. ఈ రికార్డును నెలకొల్పడానికి. ఇంగ్లాండ్ గడ్డ మీదే ఈ ఘనతను సాధించడం కేవలం లాంఛనప్రాయమే అవుతుంది. ఎన్ని టెస్టుల్లో అనేది వేచి చూడాల్సి ఉంటుంది. కోహ్లీ సూపర్ ఫామ్‌లో కొనసాగితే.. ఈ టెస్ట్‌లోనే అతను ఈ ఘనత అందుకుంటాడనటంలో సందేహాలు అక్కర్లేదు.

రోహిత్ శర్మ ఖాతాలో కూడా..

రోహిత్ శర్మ ఖాతాలో కూడా..

టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ కూడా అలాంటి రికార్డుకు చేరువగా ఉంటోన్నాడు. ఇంకో 169 పరుగులు గనక అతను పూర్తి చేయగలిగితే.. టెస్టుల్లో రెండు వేల పరుగుల ల్యాండ్‌మార్క్‌ను అందుకుటాడతను. ఈ మైల్ స్టోన్ కూడా ఇంగ్లాండ్ గడ్డ మీదే పూర్తి కావడానికి చాలావరకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా టెస్టుల్లో రెండువేల పరుగులను చేసిన క్రికెటర్లు 22 మంది ఉన్నారు. రోహిత్ శర్మ 23వ బ్యాట్స్‌మెన్ అవుతాడు. అదే సమయంలో- రోెహిత్ శర్మ 100 పరుగులు చేస్తే.. అన్ని ఫార్మట్లలో కలిపి 15,000 పరుగులు చేసిన వాడవుతాడు.

జడేజా ఖాతాలోనూ

జడేజా ఖాతాలోనూ

ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రెండు వికెట్లను పడగొడితే.. 450 వికెట్లను తీసుకున్నవాడవుతాడు. అన్ని ఫార్మట్లను కలిపి అతను ఇప్పటిదాకా 448 మందిని పెవిలియన్ దారి పట్టించాడు. అన్ని ఫార్మట్లలోనూ కలిపి 450 మంది అవుట్ చేసిన నాలుగో బౌలర్ అవుతాడు. రవీంద్ర జడేజా కంటే ముందు న్యూజిలాండ్ స్టార్ స్పిన్నర్ డేనియల్ వెటోరీ, బంగ్లాదేశ్ ఏస్ బౌలర్ షకిబుల్ హసన్, శ్రీలంకకు చెందిన రంగన హెరాత్ ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్ ఇంకో అయిదు వికెట్లు తీసుకుంటే.. టెస్ట్ క్రికెట్‌లో అత్యధికమందిని అవుట్ చేసిన భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ రికార్డును దాటేస్తాడు. భజ్జీ తన కేరీర్‌లో 417 వికెట్లు పడగొట్టాడు.

ఇషాంత్ శర్మదీ అదే దారి..

ఇషాంత్ శర్మదీ అదే దారి..

టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ తన రికార్డుకు అత్యంత చేరువగా ఉన్నాడు. టెస్టుల్లో జహీర్ ఖాన్ నెలకొల్పిన రికార్డును దాటేయడానికి ఇషాంత్ శర్మకు ఒక్క వికెట్ చాలు. జహీర్ ఖాన్ 311 వికెట్లు తీసుకోగా.. ఇషాంత్ కూడా అదే ఫిగర్‌లో కొనసాగుతోన్నాడు. ఒక్క వికెట్ తీసుకుంటే జహీర్ ఖాన్‌ను దాటేస్తాడు లంబూ ఇషాంత్ శర్మ. ఇంగ్లాండ్ క్రికెట్ జట్టులో సామ్ కుర్రన్ ఇలాంటి ల్యాండ్ మార్క్‌కు దగ్గరగా ఉన్నాడు. అతను అయిదు వికెట్లు తీసుకుంటే.. టెస్టుల్లో 50 వికెట్లను అందుకున్న ప్లేయర్ల క్లబ్‌లో చేరుతాడు. యార్కర్ కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా టెస్టుల్లో వంద వికెట్లను అందుకోవడానికి రెడీ అయ్యాడు. దీనికోసం అతను ఇంకో అయిదుమందిని అవుట్ చేయాల్సి ఉంది.

జో రూట్ కూడా..

జో రూట్ కూడా..

ఈ అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్‌ జట్టుకు నేతృత్వాన్ని వహిస్తోన్న జో రూట్ పరిస్థితి కూడా ఇంతే. బ్రిటీష్ టీమ్ ఇంకొక్క టెస్ట్ మ్యాచ్‌ను గనక తన ఖాతాలో వేసుకోగలిగితే- జో రూట్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ కేప్టన్‌గా అవతరిస్తాడు. ఈ విషయంలో అతను మాజీ స్కిప్పర్ మైఖెల్ వాన్‌ను అధిగమిస్తాడు. ఇప్పటిదాకా జో రూట్ కేప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టు 26 టెస్టుల్లో విజయాలను అందుకుంది. ప్రస్తుతం అతను కూడా మైఖెల్ వాన్‌తో సమానంగా 26 టెస్టుల్లో తన జట్టును గెలిపించాడు. విరాట్ కోహ్లీ.. జో రూట్ ఇద్దరిలో ఎవరు తన జట్టును గెలిపించినా.. ఓ రికార్డ్‌ను అందుకున్నట్టవుతుంది.

Story first published: Wednesday, August 25, 2021, 12:40 [IST]
Other articles published on Aug 25, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+