
దక్షిణాఫ్రికాతో ప్రస్తుతం ఇండియా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 2-0తేడాతో టీమిండియా సిరీస్ కైవసం చేసుకుంది. ఇక సిరీస్‌లో చివరిదైన 3వ టీ20కి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి విశ్రాంతి లభించే అవకాశం ఉంది. అక్టోబర్ 4న ఇండోర్‌లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో సిరీస్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెస్ట్ తీసుకోనున్నాడు. ఈ మేరకు విశ్వసనీయ సమాచారం అందింది. టీ20 ప్రపంచకప్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియాకు అక్టోబర్ 6న బయలుదేరనున్న సంగతి తెలిసిందే. ముంబై నుంచి భారత జట్టు.. ఆసీస్ వెళ్తుంది. రెండు రోజులు విరాట్ విశ్రాంతి తీసుకుని ఆరో తారీఖున జట్టుతో కలవనున్నాడు. ఇకపోతే ఇప్పటికే ముంబైలోని తన ఇంటికి కోహ్లీ వెళ్లాడని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.
భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య అక్టోబరు 6 నుండి 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కూడా జరగనున్న సంగతి తెలిసిందే. ఇక వన్డే జట్టుకు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే 15మంది ఆటగాళ్లలో ఎవరూ కూడా వన్డే సిరీస్లో ఆడట్లేదు. అయితే రిజర్వ్ ప్లేయర్లు అయిన దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, శ్రేయాస్ అయ్యర్ మాత్రం వన్డే సిరీస్లో ఆడనున్నారు. దీపక్ హుడా గాయపడడంతో దక్షిణాఫ్రికా సిరీస్లో భారత టీ20 జట్టులోకి శ్రేయాస్ అయ్యర్ ఎంపికైన సంగతి తెలిసిందే. ఇక చివరి టీ20లో విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండకపోవడంతో నంబర్ 3 స్థానంలో శ్రేయస్ అయ్యార్ ఆడే అవకాశముంది. ఇకపోతే బెంచ్ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు అవకాశాలు రాని మిగతా ప్లేయర్లను కూడా చివరి మ్యాచ్‌లో ఆడించొచ్చు.
మూడో టీ20కి తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్, యుజ్వేంద్ర చాహల్