అప్పటికీ.. ఇప్పటికీ చాలా తేడా, అత్యుత్తమ కెప్టెన్ కోహ్లి : ధోని ప్రశంసలు
న్యూఢిల్లీ : టీమ్ ఇండియా వన్డే కెప్టెన్ ధోని.. టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై ప్రశంసల వర్షం గుప్పించాడు. టెస్టు క్రికెట్ తో పాటు మిగతా అన్ని ఫార్మాట్లలోను కోహ్లి అత్యుత్తమ కెప్టెన్ గా పేరు తెచ్చుకోవడానికి ఎక్కువ కాలమేమి పట్టదని కోహ్లిని పొగడ్తల్లో ముంచెత్తాడు ధోని.
మున్ముందు విరాట్ సారథ్యంలో టీమ్ ఇండియా మరింత ఉన్నత స్థానాలకు చేరుకుంటుందని చెప్పుకొచ్చాడు ధోని. అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో కోహ్లి ఆటకు, ప్రస్తుత ఆటకు ఎంతో తేడా ఉందన్న కోహ్లి.. తన అసాధారణ ప్రతిభతో జట్టుకు విజయాలందిస్తున్నాడని కొనియాడాడు.

గత కొన్నేళ్లుగా అద్భుత ఆటతీరుతో చెలరేగిపోతున్న కోహ్లి.. జట్టు గెలుపు కోసం చేస్తోన్న కృషి నిజంగా అభినందనీయమన్నాడు ధోని. ఎప్పుడూ మ్యాచ్ విన్నర్ గా నిలవడం అంత సులువైన పనేమి కాదని, కానీ కోహ్లి మాత్రం ఎప్పుడూ మ్యాచ్ విన్నర్ గా ఉండడానికే ప్రయత్నిస్తాడని తెలిపాడు ధోని.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications