'కెరీర్ ముగిసేలోగా కోహ్లీ అన్ని రికార్డులు బద్దలు కొడతాడు'
హైదరాబాద్: ఆధునిక ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ క్రికెటర్‌గా అందరి మన్ననలు అందుకుంటున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. కోహ్లీ తన కెరీర్ ముగిసేలోగా అన్ని రికార్డులు బద్దలు కొడతాడని వీరేంద్ర సెహ్వాగ్ జోస్యం చెప్పాడు.
'కోహ్లీ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికే లోపే అన్ని రికార్డులను బద్దలు కొడతాడు. ప్రస్తుతం కోహ్లీ టాప్ క్లాస్ బ్యాట్స్ మెన్ మాత్రమే కాదు టాప్ క్లాస్ కెప్టెన్ కూడా' అని సెహ్వాగ్ పేర్కొన్నాడు. అయితే కోహ్లీ ఎన్ని రికార్డులు బద్దలు కొట్టినా సచిన్ టెండూల్కర్‌కు చెందిన ఆ ఒక్క రికార్డుని మాత్రం అధిగమించలేడన్నాడు.

ఆ ఒక్క సచిన్ రికార్డుని కోహ్లీ బద్దలు కొట్టలేడు
ఆ ఒక్క రికార్డు ఏంటంటే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అటు వన్డేల్లో, ఇటు టెస్టుల్లో ఆడినన్నీ మ్యాచ్‌లు ఆడలేడని సెహ్వాగ్ అన్నాడు. గతంతో పోలిస్తే విరాట్ కోహ్లీ ఎంతో పరిణతి చెందాడని కోహ్లీ వ్యాఖ్యానించాడు. ప్రస్తుతం కోహ్లి సారథ్యంలో భారత్ 3-0 తేడాతో ఆసీస్‌ను ఓడిస్తుందని అన్నాడు.

టీమిండియా ప్రస్తుతం ఎంతో సమతౌల్యంగా ఉంది
టీమిండియా ప్రస్తుతం ఎంతో సమతౌల్యంగా ఉందని సెహ్వాగ్ చెప్పాడు. ‘నాణ్యమైన పేస్, స్పిన్నర్లకు భారీ స్కోర్లు అందించే బ్యాట్స్‌మెన్ అండగా నిలుస్తున్నారు. ఈ జట్టుకు విదేశాల్లో కూడా సిరీస్‌లు నెగ్గే సత్తా ఉంది' అని సెహ్వాగ్ అన్నాడు. అయితే వరుస విజయాల జోరులో ఏదో విభాగంలో విఫలమయ్యే అవకాశం ఉందని కోహ్లీ సేనను సెహ్వాగ్ హెచ్చరించాడు.

మూడు ఫార్మాట్లలో కోహ్లీ అత్యుత్తమ ఆటగాడు
మూడు ఫార్మాట్లలో కోహ్లీ అత్యుత్తమ ఆటగాడని కొనియాడాడు. పూణె జట్టు కెప్టెన్సీ నుంచి ధోనిని తప్పించడం తప్పుడు నిర్ణయమన్న సెహ్వాగ్ అన్నాడు. ఐపీఎల్‌లో కనీసం ఇప్పుడైనా తమ జట్టు పూణెను ఓడించగలదని సెహ్వాగ్ సరదాగా వ్యాఖ్యానించాడు. ఇటీవల కాలంలో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శిస్తున్నాడు.

2016-17 సీజన్‌లో 1168 పరుగులు చేసిన కోహ్లీ
వరుసగా నాలుగు టెస్టుల్లో నాలుగు డబుల్ సెంచరీలు సాధించి క్రికెట్ దిగ్గజాలైన డాన్ బ్రాడ్‌మన్, రాహుల్ ద్రవిడ్‌ల రికార్డుని అధిగమించిన సంగతి తెలిసిందే. 2016-17 సీజన్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 15 ఇన్నింగ్స్ ఆడి 1168 పరుగులు సాధించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications