Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

బంగ్లాదేశ్ ఆటగాళ్ల హెల్మెట్లకు బంతి తగలడానికి గల కారణాలివే!

IND vs BAN,2nd Test: Cheteshwar Pujara Says 'Virat Kohli Will Be Pleased With The Pink Ball Hundred'
 Virat Kohli will be pleased with the pink ball hundred: Cheteshwar Pujara

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారా ప్రశంసల వర్షం కురిపించాడు. డే నైట్‌ టెస్టును ప్రేక్షకులు బాగా ఆస్వాదిస్తున్నారని పుజారా తెలిపాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న పింక్ బాల్ టెస్ట్ రెండో రోజు ఆట ముగిసిన తర్వాత పుజారా మీడియాతో మాట్లాడాడు.

కోహ్లీ బాగా బ్యాటింగ్ చేశాడు

కోహ్లీ బాగా బ్యాటింగ్ చేశాడు

"కోహ్లీ బాగా బ్యాటింగ్ చేశాడు. అతను అన్ని ఫార్మాట్లలో పరుగులు చేసిన వ్యక్తి. అతడు పరుగులు తీయడం చూస్తుంటే ఎప్పుడూ బాగుంటుంది. ఈ పింక్ బాల్ టెస్టులో సెంచరీతో అతడు సంతోషించి ఉంటాడు. ఈ విషయాన్ని కచ్చితంగా చెప్పగలను" అని చెప్పాడు. చారిత్రాత్మక డే నైట్‌ టెస్టులో విరాట్ కోహ్లీ(136) టెస్టుల్లో 27వ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

మాకు ఎంతో ప్రేరణ కలుగుతుంది

మాకు ఎంతో ప్రేరణ కలుగుతుంది

"స్టేడియం అభిమానులతో కిక్కిరిసి ఉండటాన్ని చూస్తే.. మాకు ఎంతో ప్రేరణ కలుగుతుంది. సంప్రదాయ క్రికెట్‌ ఇంకా బతికే ఉంది. ఈ ఫార్మాట్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఈ మ్యాచ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆటగాళ్లుగా ఈ తరహా వాతవరణాన్ని ఆస్వాదిస్తారు. మేం బ్యాటింగ్‌ చేస్తున్నా, ఫీల్డింగ్‌ చేస్తున్నా మా దృష్టంతా తదుపరి బంతిపైనే" అని పుజారా తెలిపాడు.

ప్రేక్షకుల మద్దతు దొరికితే

ప్రేక్షకుల మద్దతు దొరికితే

"అలాగే బౌలర్లకు కూడా అభిమానుల ప్రోత్సాహం అవసరం. ప్రేక్షకుల మద్దతు దొరికితే బౌలర్లు మరింతగా రాణిస్తారు. ఈ మ్యాచ్‌ నాలుగు రోజులు కూడా సాగకపోయినా మంచి అనుభవం మిగులుతుంది. డే నైట్‌ టెస్టును ప్రేక్షకులు కూడా ఆస్వాదిస్తున్నారు" అని పుజారా అభిప్రాయపడ్డాడు.

బంగ్లా ఆటగాళ్లకు గాయాలు

బంగ్లా ఆటగాళ్లకు గాయాలు

"భారత పేసర్ల బౌన్సర్లు బంగ్లా ఆటగాళ్ల హెల్మెట్లకు బంతి తగలడానికి గల కారణాలు వెలుతురు, పింక్‌ బాల్‌. షార్ట్ పిచ్ బంతులను అంత తేలిక కాదు. భారత బౌలింగ్‌కు తగ్గట్టు బంగ్లా బ్యాట్స్‌మెన్‌ ఆడలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాట్స్‌మెన్‌కు షాట్‌ సెలెక్షన్‌ అంత తేలిక కాదు. బంగ్లా ఆటగాళ్లు పింక్‌ బాల్‌తో ఇప్పటిదాకా ఒక్క ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ కూడా ఆడలేదనుకుంటున్నా" అని పుజారా పేర్కొన్నాడు.

Story first published: Sunday, November 24, 2019, 14:34 [IST]
Other articles published on Nov 24, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+