T20 World Cup 2022: విరాట్ కోహ్లీ నువ్వు కింగ్ వే.. సోషల్ మీడియాలో విరాట్ పై ప్రశంసల వర్షం..

విరాట్ కోహ్లీ పని అయిపోయింది. ఇక విరాట్ రిటైర్మెంట్ తీసుకోవాలి. విరాట్ సెంచరీ చేయక మూడేళ్లు అవుతుందని ఆసియా కప్ కు ముందు విరాట్ కోహ్లీ విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా నడిచాయి. కానీ అతను అలాంటివి ఏం పట్టించుకోకుండా తన ఆట తను ఆడాడు. ఆసియా కప్ లో ఫామ్ లోకి వచ్చాడు. ఆప్ఘానిస్థాన్ పై సెంచరీ చేసి తన మూడేళ్ల నిరీక్షణకు తెరదించుకున్నాడు.
ఒంటి చేతితో
టీ20 వరల్డ్ కప్ కు విరాట్ కోహ్లీని ఎంపిక చేశారు. కానీ కొందరు మాత్రం అతనిపై మాత్రం విమర్శలు ఆపలేదు. కానీ పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో కోహ్లీ విటన్నింటికీ సమాధానం ఇచ్చాడు. మ్యాచ్ ను ఒంటి చేతితో గెలిపించి కింగ్ కోహ్లీ అనిపించుకున్నాడు. దీంతో కోహ్లీని విమర్శించిన వారే ఇప్పుడు పొగడ్తలతో ముంచేత్తున్నారు. కింగ్ కోహ్లీ అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు. ఆహా కోహ్లీ..ఓహో కోహ్లీ అంటూ ప్రశంసిస్తున్నారు.
ఇఫ్తికార్ అహ్మద్, షాన్ మసూద్
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 12 ఇండియా, పాకిస్థాన్ పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. ఇఫ్తికార్ అహ్మద్ 34 బంతుల్లో 4 సిక్స్ లు, 2 ఫోర్లతో 51 పరుగులు చేశాడు. షాన్ మసూద్ 42 బంతుల్లో 5 ఫోర్లతో 52 పరుగులు చేశాడు.
హర్ష్ దీప్, పాండ్యా
భారత్ బౌలర్లలో హర్ష్ దీప్ 4 ఓవర్లు వేసి 32 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ 4 ఓవర్లలో 22 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టగా.. మహ్మద్ షమీ 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు. ఒక ఓవర్ వేసిన అక్షర్ పటేల్ 21 పరుగులించాడు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మూడు ఓవర్లు వేసి 23 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
కింగ్ కోహ్లీ
149 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఏడు ఓవర్లకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. చివరి ఓవర్లో హార్దిక్ ఔటయ్యాడు. ఇక మ్యాచ్ ఓడిపోతుందని అందురు ఓడిపోతుందనుకున్నారు. కానీ కోహ్లీ సిక్స్ కొట్టి మ్యాచ్ ను బతికించాడు. భారత్ కు విజయాన్ని అందించాడు. కోహ్లీ 53 బంతుల్లో 4 సిక్స్ లు, 6 ఫోర్లు కొట్టి 82 పరుగులతో అజేయంగా నిలిచాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications