Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ ఫిట్‌నెస్ లెవెల్స్.. ఎనిమిదేళ్లలో బరువు మారలేదట!

Virat Kohli weiaght does not change for last eight years

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎంత అద్భుతంగా బ్యాటింగ్ చేస్తాడో.. తన ఫిట్‌నెస్‌ను కూడా అంతే సీరియస్‌గా తీసుకుంటాడు. ప్రపంచ క్రికెట్లో ఫిట్టెస్ట్ క్రీడాకారుల పేర్లు చెప్పాలంటే ఆ జాబితాను కోహ్లీతోనే ప్రారంభించాలి అనడం అతిశయోక్తి కాదు. కోహ్లీకి ఫిట్‌నెస్‌పై ఉన్న మక్కువ రహస్యమేమీ కాదు. జిమ్‌లో అతను చేసే వర్కవుట్‌లకు సంబంధించిన వీడియోలు నెట్టింట చాలా వరకు వైరల్ అవుతుంటాయన్న సంగతి తెలిసిందే.

సూపర్ ఫీల్డర్

సూపర్ ఫీల్డర్

కోహ్లీ అంత ఫిట్‌గా ఉంటాడు కాబట్టే.. మైదానంలో చురుకుగా కదులుతుంటాడు. క్రికెట్‌లో బెస్ట్ ఫీల్డర్లలో ఒకడిగా అతన్ని అందరూ చెప్తారు. బ్యాటింగ్ చేసే సమయంలో రన్స్ తీసేటప్పుడు కూడా కోహ్లీని రనౌట్ చేయడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే అతను మెయింటైన్ చేసే ఫిట్‌నెస్ లెవెల్స్ వల్ల వికెట్ల మధ్య చాలా వేగంగా పరుగు తీసే కోహ్లీ.. రన్స్ తీసే సమయంలో అత్యుత్తమంగా గంటకు 33 కిలోమీటర్ల వేగానికి చేరుకుంటాడని గణాంకాలు చెప్తున్నాయి.

కోహ్లీ బరువు ఎంతంటే?

కోహ్లీ బరువు ఎంతంటే?

శనివారం నాడు 34వ బర్త్ డే జరుపుకున్న విరాట్ కోహ్లీని స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూ చేసింది. దీనిలో చాలా ఆసక్తికర విషయాలు వెల్లడించిన కోహ్లీ.. తన ఎత్తు, బరువు వివరాలు కూడా చెప్పాడు. 'నా ఎత్తు 5 అడుగుల 11 అంగుళాలు అనుకుంటా. ఇక బరువు అంటారా గత ఎనిమిదేళ్లలో 74.5 నుంచి 75 కేజీల మధ్యనే ఉన్నా' అని వెల్లడించాడు. ఎనిమిదేళ్లలో బరువులో ఇలా మార్పులేదంటేనే కోహ్లీ ఎంతలా ఫిట్‌నెస్ లెవెల్స్ మెయింటైన్ చేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు.

ఫేవరెట్ డిజర్ట్ ఏంటంటే?

ఫిట్‌నెస్ అంటే పిచ్చి ప్రేమ చూపించే కోహ్లీ.. దీనికోసమే మాంసాహారం కూడా పూర్తిగా మానేశాడు. మరి అలాంటి కోహ్లీకి ఇష్టమైన డిజర్ట్ ఏంటి? ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పిన కోహ్లీ.. 'నేను డిజర్ట్ తీసుకుంటే బాగా ఇష్టపడేది మాల్వా పుడ్డింగ్. ఇది సౌతాఫ్రికాలో దొరుకుతుంది. జహీర్ ఖాన్ రికమెండ్ చేస్తే తొలిసారి దీన్ని తిన్నా. దేశీ ఫుడ్స్ అయితే.. గాజర్ హల్వా (కేరట్ హల్వా) ఇష్టం. ఇంట్లో రాగి హల్వా కూడా చేసుకుంటాం. అది కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ట్రై చేయండి' అని చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, November 6, 2022, 13:20 [IST]
Other articles published on Nov 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+