Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli : కోహ్లీ కూడా లెక్కల్లో వీకే.. టెన్త్ క్లాస్‌లో ఎన్ని మార్కులు వచ్చాయంటే?

టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ పేరు తెలియని క్రికెట్ లవర్ ఉండడు. దాదాపుగా భారత్‌కు కీలకమైన ప్రతి మ్యాచులోనూ కోహ్లీ రాణించాడు. ముఖ్యంగా ఛేజింగ్‌లో కోహ్లీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ మామూలుగా ఉండదు. అందుకే అతన్ని ఛేజ్ మాస్టర్ అని అభిమానులు పిలుస్తుంటారు. అలాంటి క్రికెటర్‌కు పదో తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయి? అని అప్పుడప్పుడూ కొందరికీ అనుమానాలు వస్తుంటాయి. ఇదిగో ఈ ప్రశ్నలకు సమాధానంగా కోహ్లీ పదో తరగతి మార్క్స్ లిస్టు బయటకు వచ్చింది.

తన పదో తరగతిలో అన్ని సబ్జెక్టుల్లో కోహ్లీ హాఫ్ సెంచరీ కొట్టాడు. అన్ని పరీక్షల్లో 50 పైగా మార్కులు సంపాదించాడు. కానీ అతని బెస్ట్ సబ్జెక్టు ఏదో తెలుసా? ఇంగ్లిష్. అవునండీ ఇంగ్లిషులో కోహ్లీ 83 మార్కులు సాధించాడు. అతని మార్కుల లిస్టులో ఇదే టాప్ స్కోరు. ఇక కోహ్లీ పూర్ సబ్జెక్టులు అందరిలాగే సైన్స్, మ్యాథ్స్. ఈ రెండింట్లో కోహ్లీ పెద్దగా మార్కులు సాధించలేదు. సైన్స్‌లో ప్రాక్టికల్స్‌తో కలిపి 55 మార్కులు వస్తే.. గణితంలో 51 మార్కులే వచ్చాయి.

Virat Kohli weak subject in 10th class is also maths

అంటే కోహ్లీ కూడా అందరిలాగే టెన్త్ క్లాస్‌లో లెక్కల్లో తడబడ్డాడు అన్నమాట. మిగతా సబ్జెక్టుల్లో హిందీలో 75 మార్కులు, సోషల్ సైన్సెస్‌లో 81 మార్కులు తెచ్చుకున్నాడు కోహ్లీ. ఈ మార్కుల లిస్టు చూసిన కొంత మంది అభిమానులు.. టెన్త్‌లో కూడా కోహ్లీ యావరేజ్ 50 పైగానే ఉందని సరదాగా జోకులు వేస్తున్నారు. మరికొందరేమో ఆ లెక్కల మార్కులు చూస్తుంటేనే.. కోహ్లీ స్ట్రైక్ రేటు ఎలా లెక్కలు వేస్తాడో తెలుస్తోందంటూ ఎగతాళి చేస్తున్నారు.

ఏదేమైనా గతేడాది బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్లీ గాడిలో పడినట్లే కనిపిస్తున్న కోహ్లీ.. మూడు ఫార్మాట్లలో సెంచరీలతో ఆకట్టుకున్నాడు. అయితే ఇంకా తను అనుకున్న బెస్ట్ బ్యాటింగ్ చేయడం లేదని, ఐపీఎల్‌లో ఆ స్థాయికి చేరే అవకాశం ఉందని కోహ్లీ ఆశాభావం వ్యక్తం చేశాడు. దీంతో అందరూ కూడా కోహ్లీ బ్యాటింగ్ విన్యాసాలు చూసేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వన్డే వరల్డ్ కప్ ఈ ఏడాది చివర్లో ఉన్న నేపథ్యంలో కోహ్లీ ఫామ్ భారత్‌కు చాలా కీలకం కానుంది.

Story first published: Thursday, March 30, 2023, 18:43 [IST]
Other articles published on Mar 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+