ఫ్యాన్స్ తాకిడి: రెండు రోజులకే దెబ్బతిన్న విరాట్ కోహ్లీ మైనపు విగ్రహం


హైదరాబాద్: బుధవారం టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మైనపు విగ్రహం దేశ రాజధాని ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఈ విగ్రహం కాస్త దెబ్బ తిన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
బుధవారం(జూన్ 6న) ఉదయం టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, కపిల్ దేవ్ సరసన న్యూఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో విరాట్ కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.

మ్యూజియానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన అభిమానులు
కోహ్లీ మైనపు విగ్రహాన్ని చూసేందుకు అభిమానులు మ్యూజియానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అంతేకాదు కోహ్లీ విగ్రహంతో సెల్ఫీలు, ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో కోహ్లీ కుడి చెవి పైభాగం పాక్షికంగా దెబ్బతింది. వెంటనే గమనించిన మ్యూజియం నిర్వాహకులు వెంటనే మరమ్మతు చర్యలు చేపట్టారు.

సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
చెవి భాగానికి సంబంధించిన కొలతలను నిపుణులకు పంపించారు. వీలైనంత త్వరగా దానిని తయారు చేసి పంపాల్సిందిగా కోరారు. దెబ్బతిన్న కోహ్లీ మైనపు విగ్రహం ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాగా, టుస్సాడ్స్‌లో ఏర్పాటు చేసిన కోహ్లీ విగ్రహం చూస్తే నిజంగా కోహ్లీని చూసినట్టే ఉందని పలువురు అభిమానులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

సెల్ఫీలతో సందడి చేసిన అభిమానులు
దీంతో కోహ్లీ మైనపు విగ్రహాం ముందు అభిమానులు సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. మైదానంలో కోహ్లీ బ్యాటింగ్ చేసే సమయంలో ఎంత కసిగా, దూకుడుగా కనిపిస్తాడో.. సరిగ్గా అలా కనిపించేలా నిర్వాహకులు కోహ్లీ విగ్రహాన్ని తయారు చేశారు.
వన్డే జెర్సీలో కోహ్లీ విగ్రహం
ఇదే మ్యూజియంలో ఇప్పటికే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మైనపు విగ్రహాం కూడా ఉంది. సచిన్ మైనపు విగ్రహాన్ని టెస్టు జెర్సీలో మ్యూజియం నిర్వాహకులు రూపొందించగా... విరాట్ కోహ్లీ విగ్రహాన్ని వన్డే జెర్సీలో రూపొందించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications