Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మేడమ్ టుస్సాడ్స్‌‌లో ఆవిష్కరించిన కోహ్లీ మైనపు విగ్రహాం ఇదే (ఫోటోలు)

Virat Kohli wax figure unveiled at Madame Tussauds in New Delhi

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. క్రికెట్ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, కపిల్‌ దేవ్‌ సరసన న్యూఢిల్లీలోని మేడమ్‌ టుస్సాడ్స్‌ మ్యూజియంలో విరాట్‌ కోహ్లీ మైనపు విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. కోహ్లీ మైనపు విగ్రహాన్ని చూసేందుకు అభిమానులు మ్యూజియానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Virat Kohli all set to unveil his Wax statue at iconic museum

ఈ విగ్రహం చూస్తే నిజంగా కోహ్లీని చూసినట్టే ఉందని పలువురు అభిమానులు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. దీంతో కోహ్లీ మైనపు విగ్రహాం ముందు అభిమానులు సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. మైదానంలో కోహ్లీ బ్యాటింగ్‌ చేసే సమయంలో ఎంత కసిగా, దూకుడుగా కనిపిస్తాడో.. సరిగ్గా అలా కనిపించేలా నిర్వాహకులు కోహ్లీ విగ్రహాన్ని తయారు చేశారు.

ఇదే మ్యూజియంలో ఇప్పటికే మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్ మైనపు విగ్రహాం కూడా ఉంది. సచిన్‌ మైనపు విగ్రహాన్ని టెస్టు జెర్సీలో మ్యూజియం నిర్వాహకులు రూపొందించగా... విరాట్ కోహ్లీ విగ్రహాన్ని వన్డే జెర్సీలో రూపొందించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే తన మైనపు విగ్రహాన్ని బుధవారం ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్‌ మ్యూజియంలో ఆవిష్కరిస్తున్నారని, ఈ కార్యక్రమానికి అభిమానులు హాజరుకావాల్సిందిగా కోహ్లీ మంగళవారం తన ట్విట్టర్‌లో ఓ వీడియోని పోస్టు చేసి అభిమానులను కోరిన సంగతి తెలిసిందే.

'జూన్ 6న ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్‌కు అందరూ రండి. అక్కడ ఏర్పాటు చేసిన నా స్టాచ్యూతో ఆడుకోండి. నా మైనపు విగ్రహాన్ని మ్యూజియంలో ప్రదర్శన కోసం ఏర్పాటు చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని ట్వీట్ చేశాడు.

తన అద్భుతమైన ఆటతీరుతో విరాట్ కోహ్లీ ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానుల్ని సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఆటగాడిగా మాత్రమే కాకుండా కెప్టెన్‌గా కూడా భారత జట్టుకు ఎన్నో చారిత్రాత్మక విజయాలను అందించాడు. మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో ఒకడిగా విరాట్ కోహ్లీ ఒకడిగా పేరొందాడు.

కోహ్లీ మైనపు విగ్రహాన్ని ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. తద్వారా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, ఫుల్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీల తర్వాత ఈ ఘనత అందుకోబోతున్న క్రీడాకారుడు విరాట్ కోహ్లీనే కావడం విశేషం.

గత మార్చి నెలలో లండన్‌ నుంచి వచ్చిన టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధుల బృందం విగ్రహం తయారీకి అవసరమైన 200 కొలతలను తీసుకున్నారు. 2008లో కోహ్లీ నేతృత్వంలోని అండర్-19 జట్టు వరల్డ్ కప్‌ను సాధించడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఐసీసీ వరల్డ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్, మూడు సార్లు బీసీసీఐ ఇంటర్‌నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్నాడు.

Story first published: Wednesday, June 6, 2018, 16:13 [IST]
Other articles published on Jun 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+