హైదరాబాద్: ఐసీసీ 2016 సంవత్సరానికి గాను వార్షిక అవార్డులను ప్రకటించింది. ఈ ఏడాది టెస్టులు, వన్డేల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన భారత ఆటగాళ్లు కొందరు ఐసీసీ ప్రకటించిన జాబితాలో చోటు దక్కించుకున్నారు. రన్ మిషన్, టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 2016 సంవత్సరానికి ఐసీసీ వన్డే జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
ఐసీసీ ఎంపిక చేసిన వన్డే జట్టులో టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజాలకు కూడా చోటు దక్కింది. క్రికెట్ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, గ్యారీ కిర్‌స్టెన్, కుమార సంగక్కర ఈ జట్లను ఎంపిక చేశారు. 2015 సెప్టెంబర్ 14 నుంచి 2016 సెప్టెంబర్ 20వ తేదీ వరకు వాళ్లు చూపిన ప్రతిభ ఆధారంగా ఈ జట్లను ఎంచుకున్నారు.
ఐసీసీ వన్డే జట్టు ఆఫ్ ద ఇయర్ 2016:
1. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)
2. క్వింటన్ డికాక్ (దక్షిణాఫ్రికా - వికెట్ కీపర్)
3. రోహిత్ శర్మ (ఇండియా)
4. విరాట్ కోహ్లీ (కెప్టెన్ -ఇండియా)
5. ఏబీ డివీలియర్స్ (దక్షిణాఫ్రికా)
6. జాస్ బట్లర్ (ఇంగ్లండ్)
7. మిషెల్ మార్ష్ (ఆస్ట్రేలియా)
8. రవీంద్ర జడేజా (ఇండియా)
9. మిషెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)
10. కగిసో రబడా (దక్షిణాఫ్రికా)
11. సునీల్ నరైన్ (వెస్టిండీస్)
12. ఇమ్రాన్ తాహిర్ (దక్షిణాఫ్రికా)
ఇక ఈ ఏడాది ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో రెండు టాప్ అవార్డులను టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దక్కించుకున్నాడు. ఈ ఏడాది అత్యుత్తమ క్రికెటర్ అవార్డుతో పాటు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును సైతం అశ్విన్ దక్కించుకున్నాడు.
రాహుల్ ద్రవిడ్ తర్వాత ఒక ఏడాదిలో రెండు అవార్డులను సొంతం చేసిన రెండో భారత క్రికెటర్‌గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు. దీంతో పాటు 12 మంది సభ్యులతో ఐసీసీ ప్రకటించిన టెస్టు జట్టులో స్థానం పొందిన ఏకైక భారత ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు.
ఐసీసీ ప్రకటించిన టెస్టు జట్టులో ఆస్ట్రేలియా ఆటగాళ్లు నలుగురు, ఇంగ్లాండ్ ఆటగాళ్లు నలుగురు, భారత్, శ్రీలంక, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా తరపున ఒక్కొక్కరు చొప్పున చోటు దక్కించుకున్నారు. ఐసీసీ టెస్టు జట్టు కెప్టెన్‌గా ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ అలెస్టర్ కుక్ ఎంపికయ్యాడు.
ఐసీసీ టెస్టు జట్టు ఆఫ్ ద ఇయర్ 2016:
1. డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)
2. అలిస్టర్ కుక్ (ఇంగ్లండ్ - కెప్టెన్)
3. కేన్ విలియంసన్ (న్యూజిలాండ్)
4. జో రూట్ (ఇంగ్లండ్)
5. ఆడమ్ వోగ్స్ (ఆస్ట్రేలియా)
6. జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్ - వికెట్ కీపర్)
7. బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్)
8. రవిచంద్రన్ అశ్విన్ (ఇండియా)
9. రంగనా హీరత్ (శ్రీలంక)
10. మిషెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)
11. డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా)
12. స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా)