న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అడిలైడ్‌లో కోహ్లీకి కవ్వింపులు, సరదాగా చిందులేస్తూ విరాట్

 Virat Kohli was more determined after being booed in Adelaide Test: Ricky Ponting

అడిలైడ్‌: ప్రత్యర్థుల్ని కవ్వించడంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లే కాదు.. ఆ జట్టు అభిమానులూ ముందుంటారు. 2012 పర్యటనలో తనను స్టేడియంలోని అభిమానులు వెక్కిరిస్తుంటే.. కోహ్లి వాళ్లకు మధ్య వేలు చూపించడం చర్చనీయాంశమైంది. ఐతే గత పర్యటనలో తనను కవ్వించే ప్రయత్నం చేస్తే.. బ్యాటుతో గట్టిగానే సమాధానం చెప్పాడు. ఇక తాజా పర్యటనలోనూ ఆస్ట్రేలియన్ల నుంచి విరాట్‌కు వెక్కిరింపులు తప్పట్లేదు.

తప్పుపట్టిన పాంటింగ్‌, ట్రావిస్‌

తప్పుపట్టిన పాంటింగ్‌, ట్రావిస్‌

తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైన విరాట్‌.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వస్తుండగా.. స్టేడియంలోని కొందరు ఆస్ట్రేలియా అభిమానులు ఎగతాళిగా అరిచారు. ఐతే విరాట్‌ ఇవేమీ పట్టించుకోకుండా ప్రశాంతంగా బ్యాటింగ్‌ చేశాడు. అయితే అభిమానుల ప్రవర్తనను రికీ పాంటింగ్‌, ట్రావిస్‌ హెడ్‌ తప్పుపట్టారు. అటు బుమ్రా కూడా ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి సారిస్తామని తెలిపాడు.

స్పిన్నర్‌ లియాన్‌ కూడా కోహ్లీని ఎగతాళి చేస్తూ

స్పిన్నర్‌ లియాన్‌ కూడా కోహ్లీని ఎగతాళి చేస్తూ

అలాగే తన బౌలింగ్‌లో డిఫెన్స్‌ ఆడే క్రమంలో షార్ట్‌ లెగ్‌లో అవుటై వెళుతున్న కోహ్లీని స్పిన్నర్‌ లియాన్‌ కూడా ఎగతాళి చేశాడు. డిఫెన్స్‌ ఆడే విధానాన్ని లియాన్‌ అనుకరిస్తూ కనిపించాడు. మూడో రోజు నాటౌట్‌గా నిలిచి పెవిలియన్‌ చేరితే బాగుండేది కానీ.. మరి కాసేపట్లో ఆట ముగుస్తుందనగా ఔటై పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.

మైదానంలోనూ చిందులేసిన కోహ్లీ..

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి క్రికెట్‌ను చక్కగా ఆస్వాదిస్తాడనుకోవడమే కాదు. మైదానంలో ఎంజాయ్ చేస్తున్నాడు కూడా. తన డ్యాన్సింగ్ నైపుణ్యాన్ని మరో సారి చూపించాడు. విరామ సమయాల్లో వేడుకల్లో పాల్గొని చిందులు వేసే కోహ్లీ.. అడిలైడ్ మైదానంలోనూ చిందులు వేశాడు. గతంలో భారత క్రికెటర్లతో కలిసి.. తన ప్రేయసి అనుష్క శర్మతో కలిసి నృత్యం చేసిన వీడియోలు కోకొల్లలుగా సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేశాయి.

 బౌలర్లు చక్కటి ప్రదర్శన చేస్తుండటంతో

బౌలర్లు చక్కటి ప్రదర్శన చేస్తుండటంతో

డ్రెస్సింగ్‌ రూంల్లో కూడా విరాట్‌ తన నృత్య ప్రతిభ చూపిస్తుంటాడట. ఐతే తొలిసారిగా అతను మైదానంలోనూ నృత్యం చేశాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు మూడో రోజు తొలి సెషన్లో స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లి.. కొన్ని క్షణాల పాటు స్టెప్పులేశాడు. మ్యాచ్‌లో భారత్‌దే పైచేయి కావడం, బౌలర్లు చక్కటి ప్రదర్శన చేస్తుండటంతో విరాట్‌ ఉత్సాహంలో ఇలా నృత్యం చేసినట్లున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది.

Story first published: Sunday, December 9, 2018, 9:53 [IST]
Other articles published on Dec 9, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X