'ఆసీస్ గడ్డపై ఓపెనర్లు.. కోహ్లీ కంటే కీలకం'

న్యూ ఢిల్లీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న 4టెస్టుల సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కంటే ఓపెనర్లే కీలకమని సీనియర్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. తొలి ఇన్నింగ్న్‌లో భాగంగా తొలిరోజు టీమిండియా ఓపెనర్లు తడబడ్డారు. విరాట్ కోహ్లీతో పాటు టాపార్డర్ బ్యాట్స్‌మెన్ అంతా నిరాశపరిచారు. ఈ పేలవ ప్రదర్శనపై గవాస్కర్ పెదవి విరిచారు. టెస్టు ఫార్మాట్ స్థాయి ప్రదర్శన చేయలేకపోయారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ప్రతిసారీ అతడిపైనే భారం
‘ఆసీస్ టెస్టులో ఓపెనర్లు చాలా కీలకం. ఓపెనర్లు ఎలా ఆడతారనే దానిపై మ్యాచ్ విజయం ఆధారపడి ఉంది. విరాట్ కోహ్లీ కంటే వారే కీలక పాత్ర పోషించాలి. ఒక వేళ వారు విఫలమయితే అప్పుడు కోహ్లీ రంగంలోకి దిగుతాడు. ప్రతిసారీ అతడిపైనే భారం వేయడం సరికాదు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ జట్టు కట్టుదిట్టమైన బౌలింగ్ చేసింది. ఇప్పుడు చేసిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటే ఆసీస్ గడ్డపై కోహ్లీ సేన చరిత్ర సృష్టించవచ్చు' అని చెప్పుకొచ్చారు.

తొలి ఇన్నింగ్స్‌లో 250కు ఆలౌట్
అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 250 పరుగులకు ఆలౌట్ అయ్యింది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లోనూ కేఎల్ రాహుల్ విఫలమైతే రెండో టెస్టుకు అవకాశమివ్వొద్దని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సూచించాడు. గురువారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 బంతులు ఎదుర్కొన్న కేఎల్ రాహుల్ 2 పరుగులకే పేలవ రీతిలో ఔటయ్యాడు. దీంతో తర్వాతి టెస్టులో జట్టులోకి తీసుకోవద్దంటూ సెలక్షన్ కమిటీకి సలహాలిస్తున్నాడు.

తొలి రోజు అనుకూలించినట్లే రెండో రోజూ..
ఆసీస్ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో పూజారా ఒక్కడే రాణించాడు. మిగిలినవారంతా విఫలమవడంతో వారి ప్రదర్శనపై ధ్వజమెత్తారు. టెస్టు మ్యాచ్ ఐదు రోజుల ఫార్మాట్ అని మర్చిపోయారా అంటూ దుమ్మెత్తిపోశారు. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో తొలి రోజు అనుకూలించినట్లే బౌలర్లకు రెండో రోజు అనుకూలించడంతో ఏడు వికెట్లు తీసి 191 పరుగులకు కట్టడి చేయగలిగారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications