|
గతంలో కోహ్లీ కూడా అంపైర్ల తప్పిదంలో ఔటయ్యాడు
గతంలో అంపైర్ల తప్పిదంతో కోహ్లీ సైతం చాలా సార్లు అవుటయ్యాడు. అంపైర్ల తప్పుడు నిర్ణయాల వల్ల ఔటయినప్పుడు కలిగే బాధేంటో కోహ్లీకి తెలుసు అందుకే.. మాథ్యు వేడ్ ఔటయినప్పుడు అతన్ని పరామర్శించాలనే ఉద్దేశంతో కోహ్లీ ఇలా ప్రవర్తించాడు. ఈ సీజన్లో మాథ్యు వేడ్ చాలా పేలవ ఫాం కనబరుస్తున్న సమయంలో ఈ రకంగా ఔటవ్వడం కోహ్లీని బాధించే ఉంటుంది. అందుకే మిత్రమా నీ తప్పిదం ఏం లేదు.. ఏం బాధపడొద్దు అన్నట్లు భుజం మీద చేయి వేసి ఓదార్పు ఇచ్చాడు. ఇకపోతే నిన్నటి మ్యాచ్ మినహా ఈ సీజన్ మొత్తం కోహ్లీ పేలవ ఫాంలో ఉన్న సంగతి తెలిసిందే.
|
అసలేం జరిగిందంటే..?
క్రీజులోకి వచ్చీ రాగానే 5వ ఓవర్లో మాథ్యు వేడ్ హజిల్ వుడ్ (16) బౌలింగ్‌లో 2ఫోర్లు, 1సిక్సర్‌తో మంచి టచ్‌లో కన్పించాడు. కానీ 16పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గ్లేన్ మాక్స్వెల్ బౌలింగ్‌లో మాథ్యూవెడ్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. కానీ.. బంతి బ్యాట్‌కి తాకిందని ఆరోపించిన మాథ్యూ వేడ్.. ఫీల్డ్ అంపైర్ ఔటివ్వగానే చాలా కాన్ఫిడెంట్‌గా ఇది నాటౌట్ అంటూ డీఆర్ఎస్ కోరాడు. థర్డ్ అంపైర్ ఆల్ట్రా ఎడ్జ్‌కు వెళ్లాడు. అల్ట్రా ఎడ్జ్‌లో బంతి బ్యాట్‌కు తాకకుండానే ప్యాడ్లకు తాకినట్లు ఉంది. అయితే నార్మల్ గా చూసినప్పుడు బంతి గ్లవ్స్‌కు తాకి కాస్త డౌన్ అయి ప్యాడ్లకు తాకినట్లు స్పష్టంగా కన్పించింది. ఇక ఈ విషయం థర్డ్ అంపైర్ పట్టించుకోలేదు. నేరుగా బాల్ ట్రాకింగ్‌కు వెళ్లాడు. ఈ బాల్ ట్రాకింగ్ ఆధారంగా ఔట్ అని ప్రకటించాడు.

వేడ్ బాధను చూడలేక కోహ్లీ వెనకాల నుంచి వచ్చి
దాంతో తీవ్రంగా నిరాశపడ్డ మాథ్యువేడ్ తిట్టుకుంటూ పెవిలియన్‌కి బయలుదేరాడు. ఈక్రమంలో మాథ్యు వేడ్ బాధను చూసిన కోహ్లీ అతను వెళుతుంటే వెనకాల నుంచి వచ్చి అతని భుజం తట్టి పర్లేదు మిత్రమా నీ తప్పు లేదు. అది అంపైర్ తప్పన్నట్లు ఓదార్పునిచ్చేలా వ్యవహరించాడు. ఇక ఔటయిన బాధలో మాథ్యూ వేడ్ డ్రెస్సింగ్ రూంలో తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. అంపైర్‌పై ఉన్న కోపాన్ని తన బ్యాట్, హెల్మెట్‌పై చూపించాడు. హెల్మెట్ విసిరేసి, బ్యాట్ ను నేలకేసి బాధుతూ అసహనం వ్యక్తం చేశాడు. వేడ్ డ్రెస్సింగ్ రూమ్‌లో చాలా అగ్రెసివ్‌గా ప్రవర్తించినందుకుగాను ఐపీఎల్ నిర్వాహకులు ప్రవర్తనా నియమావళి ప్రకారం వికెట్ లెవల్ 1 నేరానికి పాల్పడ్డాడని తీర్పునిచ్చింది. దీంతో తదనుగుణంగా అతనికి ఫైన్ పడనుంది.