అందుకే విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్సీ వదులు కోవడం లేదా?

న్యూఢిల్లీ: యూఏఈ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్ కప్‌ అనంతరం టీమిండియా టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని విరాట్ కోహ్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక కోహ్లీ అనూహ్య నిర్ణయం నేపథ్యంలో అనేక కథనాలు ప్రచారంలోకి వస్తున్నాయి. కోహ్లీ ప్రకటనకు రెండు రోజుల ముందు ప్రపంచకప్ తర్వాత పరిమిత ఓవర్ల సిరీస్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటాడని, రోహిత్ శర్మ ఆ బాధ్యతలు చేపడుతాని ప్రచారం జరిగింది. ఈ వార్తలను బీసీసీఐ ఖండించినా.. కోహ్లీ తన ప్రకటనతో నిజం చేశాడు. అయితే విరాట్ కేవలం టీ20 కెప్టెన్సీని మాత్రమే వదులుకున్నాడు. ఇది అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. టీ20తో పాటు వన్డే కెప్టెన్సీని కూడా వదిలేయాల్సిందనే అభిప్రాయం వ్యక్తమైంది. అంతేకాకుండా టీ20 ప్రపంచకప్ విజయంపైనే అతని వన్డే కెప్టెన్సీ భవితవ్యం ఆధారపడి ఉందని, ప్రతికూల ఫలితం వస్తే వేటు పడటం ఖాయమని ప్రచారం జరుగుతుంది.

అయితే వన్డే కెప్టెన్సీని విరాట్ వదులుకోకపోవడానికి ప్రధాన కారణం అతని బ్రాండ్ వాల్యూనేనని తెలుస్తోంది. పరిమిత ఓవర్ల సిరీస్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటే మార్కెట్ విలువు తగ్గుతుందని కోహ్లీ భయపడుతున్నాడని, అందుకే వన్డే కెప్టెన్సీని వదులుకోవడం లేదని ప్రచారం జరుగుతుంది. అయితే కెప్టెన్సీ బాధ్యతలు వదులుకుంటే ఆ ప్రభావం ఏ మాత్రం అతనిపై పడదని బిజినెస్ వర్గాలు అంటున్నాయి.

కెప్టెన్సీ వదులుకున్నా..

కెప్టెన్సీ వదులుకున్నా..

క్రికెట్‌లో అత్యంత ఖరీదైన ప్లేయర్‌గా కోహ్లీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. ఎమ్‌​ఆర్‌ఎఫ్‌, అమెరికన్‌ టూరిస్టర్‌, పూమా, వోలిని, అడీ, ఉబెర్‌ ఇండియా, రాయల్‌ ఛాలెంజ్‌.. ఇలా బోలెడు బ్రాండ్స్‌కు కోహ్లీ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నాడు. అయితే ప్రధాన బ్రాండ్‌లు క్యూ కట్టడానికి ప్రధాన కారణం.. కేవలం స్టార్‌ ఆటగాడు అని మాత్రమే కాదు.. జనాల్లో కోహ్లీకి ఉన్న ఆదరణ. మీడియా, సోషల్‌ మీడియా, బుల్లితెర.. ఇలా ఏ వేదికైనా కోహ్లీకి పిచ్చ క్రేజ్ ఉంది. ఇది కోహ్లీ పర్‌ఫార్మెన్స్‌తో ఏమాత్రం సంబంధంలేని విషయమని ఇండిపెండెంట్‌ స్పోర్ట్స్‌ కన్సల్టెంట్‌ రితేస్‌ నాథ్‌ తెలిపారు. అందుకే కెప్టెన్సీ నుంచి వైదొలిగినా కోహ్లీ బ్రాండ్‌పై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు.

‘కోహ్లీ ఫామ్‌లోకి వస్తే అతని క్రేజ్ మరింత పెరుగుతుంది. అప్పుడు అతని బ్రాండ్ వాల్యూ మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. గతంలో కెప్టెన్సీ వదిలేసిన తర్వాత సచిన్‌ బ్రాండ్ విలువ ఏమాత్రం తగ్గలేదు. పైగా సచిన్ బ్యాట్స్‌మన్‌గా అద్భుతంగా రాణించాడు. దాంతో అతని వాల్యూ మరింత పెరిగింది. కోహ్లీ విషయంలో కూడా ఇదే జరిగే అవకాశం ఉంది.'అని తెలిపారు.

ఒక్క ప్రకటనకు..

ఒక్క ప్రకటనకు..

కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా చేసే ఒక్క వ్యాపార పోస్ట్‌కు కోటి ఇరవై ఐదు లక్షలు తీసుకుంటాడు. ఒకప్పుడు ఇది 80 లక్షల రూపాయల దాకా ఉండేది. ఎండోర్స్‌మెంట్‌ కోసం ఒక్కో బ్రాండ్‌కు ఏడాదికి ఏడు కోట్లపైనే ఛార్జ్‌ చేస్తున్నాడు. ఇది ఒకప్పుడు ఐదు కోట్లు ఉండేది. ప్రస్తుతం కోహ్లీ తర్వాత రోహిత్‌ శర్మ 3 కోట్ల దాకా అందుకుంటున్నాడు. అజింక్యా రహానే, కేఎల్‌ రాహుల్‌ లాంటివాళ్లు కోటి నుంచి కోటిన్నర మధ్య తీసుకుంటున్నారు. ఈ లెక్కన బ్రాండ్‌ల పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఆలోచించినా.. కోహ్లీతో పోటీపడే క్రికెట్‌ ప్లేయర్‌ ఎవరూ లేకపోవడం విశేషం. కోహ్లీ గత కొంతకాలంగా పూర్‌ పర్‌ఫార్మెన్స్‌ కనబరుస్తున్నప్పటికీ.. బ్రాండ్‌లు వెనక్కి పోకపోవడమే ఇందుకు మరో ఉదాహరణ.

రెండేళ్లుగా సెంచరీ చేయకున్నా..

రెండేళ్లుగా సెంచరీ చేయకున్నా..

రెండేళ్లుగా ఒక్క సెంచరీ కూడా చేయలేదని కోహ్లీని విమర్శించే వ్యతిరేక వర్గం కూడా.. కోహ్లీ బ్రాండ్‌ విషయానికొచ్చేసరికి సైలెంట్‌ అయిపోతోందని కోరెరో కన్సల్టింగ్‌ అండ్‌ కమ్యూనికేషన్స్ ఫౌండర్‌ సలిల్‌ వైద్యా అంటున్నారు. అలా తన ఇమేజ్‌తో ప్రత్యర్థుల నోళ్లు సైతం మూయించగల కెపాసిటీ కోహ్లీది. అలాంటిది ప్లేయర్‌గా పర్ఫార్మెన్స్‌ కనబరిస్తే.. కోహ్లీ బ్రాండ్‌ దూసుకుపోతుందని చెప్తున్నారు సలిల్‌. ‘‘కోహ్లీ అప్పీయరెన్స్‌కు జనాలు బాగా అలవాటు పడ్డారు. యూత్‌ అతనికి సంబంధించిన ఎలాంటి విషయాన్నైనా ఆస్వాదిస్తుంది. అసలు క్రికెట్‌ జెర్సీలో అతని రూపం చాలు.. ప్రచారానికి. అందుకే సీనియర్లకు, క్రికెట్‌ దిగ్గజాలకు సైతం దక్కని బ్రాండ్‌ ఇమేజ్‌.. కోహ్లీ పేరిట నడుస్తోంది ఇప్పుడు.'అని ఆయన చెప్పుకొచ్చాడు.

ఐసీసీ టీ-20 ప్రపంచ కప్ 2021 ప్రిడిక్షన్
Match 23 - October 29 2021, 03:30 PM
వెస్టిండిస్
బంగ్లాదేశ్
Predict Now
For Quick Alerts
Subscribe Now
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, September 18, 2021, 19:54 [IST]
Other articles published on Sep 18, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X