రవిభాయ్ ఉంటే సంతోషమే: కొత్త కోచ్ ఎంపికపై విరాట్ కోహ్లీ ఇలా!

హైదరాబాద్: టీమిండియా హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి కొనసాగితే తనకు సంతోషమేనని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సోమవారం వెస్టిండిస్ పర్యటనకు బయల్దేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి విరాట్ కోహ్లీ ముంబైలో మీడియా సమావేశం నిర్వహించాడు.
ప్రో కబడ్డీ 7వ సీజన్ వార్తలు, పాయింట్ల పట్టిక కోసం క్లిక్ చేయండి
ఈ సమావేశంలో విరాట్ కోహ్లీ పలు విషయాలపై స్పందించారు. రవిశాస్త్రిని తిరిగి హెడ్ కోచ్‌గా నియమించడంపై మీ అభిప్రాయం ఏంటని విలేకరులు ప్రశ్నించగా "హెడ్ కోచ్ విషయంపై క్రికెట్ సలహా కమిటీ నన్ను సంప్రదించలేదు. రవి భాయ్‌తో మా అందరికీ మంచి బంధం ఉంది. అతడినే కోచ్‌గా కొనసాగిస్తే చాలా సంతోషిస్తాం" అని అన్నాడు.

కోచ్‌పై నిర్ణయం తీసుకోవాల్సింది నేను కాదు
"కానీ కోచ్‌పై నిర్ణయం తీసుకోవాల్సింది క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ)నే. ఈ విషయంపై సీఏసీ ఇప్పటివరకు నన్ను సంప్రదించలేదు. నా అభిప్రాయం అడిగితే చెబుతా" అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్‌తోనే రవిశాస్త్రి పదవీకాలం ముగిసింది. అయితే వెస్టిండీస్ పర్యటనను దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఆయన పదవీకాల గడువును పెంచింది.

హెడ్ కోచ్‌ని ఎంపిక చేసే బాధ్యత సీఏసీదే
కాగా, మాజీ క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటి(సీఏసీ) కోచ్‌ను ఎంపిక చేయనుంది. ఈ కమిటీలో మాజీ క్రికెటర్లు కపిల్ దేవ్, మాజీ మెన్స్ కోచ్ అన్షుమన్ గైక్వాడ్, మహిళా జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామిలు సభ్యులుగా ఉన్నారు. మరోవైపు కోచ్‌ల దరఖాస్తులకు తుది గడువుని జులై 30గా బీసీసీఐ నిర్ణయించింది.

హెడ్ కోచ్ రేసులో పలువురు
టీమిండియా హెడ్ కోచ్ రేసులో మాజీ క్రికెటర్లు మహేళా జయవర్దనేతో పాటు గ్యారీ కిర్‌స్టన్, టామ్ మూడీ, మైక్ హెస్సన్, రాబిన్ సింగ్ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. ఆగస్టు 13 లేదా 14న హెడ్ కోచ్‌తో పాటు మిగతా సిబ్బందికి క్రికెట్ సలహా మండలి ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. అయితే, హెడ్ కోచ్‌గా రవిశాస్త్రినే ఎంపిక చేసే అవకాశం ఉంది.

సోమవారం ప్లోరిడాకు బయల్దేరిన టీమిండియా
కాగా, విండిస్ పర్యటనలో భాగంగా తొలి రెండు టీ20ల కోసం అమెరికాలోని ఫ్లోరిడాకు ముంబై విమానాశ్రయం నుంచి టీమిండియా బయల్దేరింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కోహ్లీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ పర్యటనలో భాగంగా టీమిండియా 3 టీ20లు, 3 వన్డేలు, 2 టెస్టు మ్యాచ్‌లు ఆడనుంది. ఆగస్టు 3న ప్రారంభయ్యే ఈ పర్యటన సెప్టెంబర్ 3తో ముగుస్తుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications