భారత్ పేసర్లు ఐపీఎల్ 2019లో ఆడొద్దు: విరాట్ కోహ్లీ సూచన


హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న వరల్డ్ కప్ దృష్ట్యా భారత సీనియర్ పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్‌లు ఐపీఎల్ 2019 నుంచి తప్పుకోవాలని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సూచించాడు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో వచ్చిన కథనం ప్రకారం కోహ్లీ ఇటీవలే బీసీసీఐ పాలకుల కమిటీని కలిశాడు.
సీఓఏ చీఫ్ వినోద్ రాయ్, సభ్యురాలు డయానా ఎడుల్జిలు హాజరైన ఈ సమావేశానికి కెప్టెన్ కోహ్లీతో పాటు హెడ్ కోచ్ రవిశాస్త్రి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ ఆటగాడు అజ్యింకె రహానే, ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ హాజరయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి.
వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకొని రానున్న ఐపీఎల్ సీజన్‌లో భారత పేస్ బౌలర్లను తప్పించాలని విరాట్ కోహ్లీ సీఓఏని కోరాడు. వచ్చే ఏడాది మే 30 నుంచి జూలై 14వరకూ ఇంగ్లాండ్‌లో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. మరోవైపు ఐపీఎల్ కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమై.. మే మూడో వారంలో ముగియనుంది.
ఈ క్రమంలో ఐపీఎల్‌కు, వరల్డ్ కప్‌కు మధ్య చాలా తక్కువ రోజుల సమయం ఉండటంతో కోహ్లీ ఈ మేరకు సూచించాడు. వరుసగా ప్రతి రోజు ఐపీఎల్ మ్యాచ్‌లు ఉండటంతో బౌలర్లు అలిసిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో వాళ్లు తిరిగి వన్డే వరల్డ్ కప్ నాటికి పూర్తిస్థాయి ఫిట్‌నెస్ సాధించడం కూడా కష్టంతో కూడుకున్న పనే. ఫలితంగా దీని ప్రభావం వన్డే ప్రపంచకప్‌పై పడుతుందని కోహ్లీ ఈ సమావేశంలో పేర్కొన్నాడు.

మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్
మే 30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐపీఎల్ 2019 షెడ్యూల్‌ను సైతం ముందుకు జరిపిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ మొదటి వారంలో ప్రారంభమై మే మూడో వారానికి ఐపీఎల్ 2019 ముగియనుంది. ఆ తర్వాత వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు టీమిండియా ఇంగ్లాండ్‌కు పయనం కానుంది.

వరల్డ్ కప్ దృష్టా ఐపీఎల్ 2019 నుంచి పేసర్లు తప్పుకుంటే
వరల్డ్ కప్ దృష్టా ఐపీఎల్ 2019 నుంచి పేసర్లు తప్పుకుంటే అందుకు బీసీసీఐ నష్టపరిహారం బీసీసీఐనే చెల్లించాలని సీఓఏతో జరిగిన సమావేశంలో కోహ్లీ విజ్ఞప్తి చేశాడు. ఇందుకు సీఓఏ అంగీకరించినట్లు తెలుస్తోంది. భారత జట్టులోని ప్రీమియం ఆటగాళ్లు ఎవరైనా ఐపీఎల్ 2019లో పాల్గొనాలని భావిస్తే కేవలం 8 నుంచి 10 మ్యాచ్‌లు ఆడేందుకే బీసీసీఐ అనుమతించాలని కోహ్లీ సూచించాడు.

ఆటగాళ్ల కోరికను బట్టి
ఆటగాళ్ల కోరికను బట్టి ఐపీఎల్ లీగ్ మొదట్లో లేదా చివర్లో అనేది వారికే వదిలేయాని కోహ్లీ అన్నాడు. కోహ్లీ నిర్ణయంపై ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే, దీనిపై భిన్న వాయిస్‌లు వినిపించడం విశేషం. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాకు చెందిన ప్రధాన ఆటగాళ్లు ఐపీఎల్ 2019 సీజన్‌కు దూరంగా ఉంటారని ఆ దేశ బోర్డులు ఇప్పటికే అనధికారికంగా ఇప్పటికే ప్రకటించాయి.

ఐపీఎల్ 2019 సీజన్‌కు ఆసీస్, ఇంగ్లాండ్ క్రికెటర్లు దూరం
ఇందులో భాగంగా జట్టులో కీలక పేసర్లు అయిన భువీ, బుమ్రా, పాండ్యాలతో పాటు మరికొంత పేస్ బౌలర్లను రానున్న ఐపీఎల్‌కు దూరంగా ఉంచాలని కోహ్లీ కోరాడు. అంతక ముందు మాదిరి కాకుండా వచ్చే సీజన్ కోసం ఈ ఏడాది ఐపీఎల్ వేలాన్ని డిసెంబర్‌లో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ వేలం కూడా బెంగళూరులో కాకుండా జైపూర్‌లో జరిగే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications