For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Virat Kohli: విరాట్ సచిన్ రికార్డును బద్దలు కొట్టడం అసాధ్యం!

Virat Kohli: సచిన్ టెండూల్కర్ 2012లో బంగ్లాదేశ్‌పై తన అంతర్జాతీయ కెరీర్‌లో 100వ సెంచరీ సాధించాడు. సచిన్ టెండూల్కర్ 2013లో రిటైర్ అయ్యాడు. ఓ కార్యక్రమంలో సల్మాన్ ఖాన్ సచిన్‌ను.. మీ రికార్డును ఎవరు బద్దలు కొడతారని అనుకుంటున్నారు అంటూ అడిగాడు. అఫ్పుడు సచిన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లను తీసుకున్నాడు. వన్డేల్లో అత్యధికంగా 49 సెంచరీలు చేసిన సచిన్ రికార్డును విరాట్ బ్రేక్ చేశాడు. కానీ టెస్టుల్లో విరాట్ సచిన్ కంటే చాలా వెనుకబడి ఉన్నాడు.

విరాట్ ఖాతాలో మొత్తం 82 సెంచరీలు
విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో 82 సెంచరీలు సాధించాడు. విరాట్ కోహ్లీ వన్డేల్లో 51 సెంచరీలు, టెస్టుల్లో 30 సెంచరీలు సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో విరాట్ ఖాతాలో ఒక సెంచరీ ఉంది. విరాట్ గత ఏడాది టీ20 ఇంటర్నేషనల్ నుంచి రిటైర్ అయ్యాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో సచిన్ తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది.

Virat Kohli vs Sachin Tendulkar Why Breaking the 100-Century Record Is Almost Impossible

100 సెంచరీల రికార్డు కోహ్లీ బ్రేక్ చేయలేడు..
విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించడంతో సచిన్ టెండూల్కర్ 100 సెంచరీల రికార్డు చెక్కు చెదరకుండా ఉంటుంది. 36 ఏళ్ల విరాట్ కోహ్లీ 2027 వన్డే ప్రపంచ కప్ వరకు ఆడగలడు. 2026 వరకు భారత్ మొత్తం 24 వన్డే మ్యాచ్‌లు ఆడింది. వీటిలో 3 మ్యాచ్‌లు ఈ ఏడాది ఆగస్టులో బంగ్లాదేశ్‌తో జరిగాయి. సంక్షోభ మేఘాలు వాటిపై కమ్ముకుంటున్నాయి. వన్డే ప్రపంచకప్ 2027 చివరలో జరగనుంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ అప్పటివరకు ఆడితే గరిష్టంగా 40 వన్డేలు ఆడగలడు. సచిన్ రికార్డును బద్దలు కొట్టడానికి విరాట్ ఇంకా 19 సెంచరీలు చేయాలి.

2026 వరకు భారత్ ఆడనున్న వన్డేలు ఇవే..
*బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా, ఆగస్టు 2025, 3 వన్డేలు
*ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా, అక్టోబర్ 2025, 3 వన్డేలు
*భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా, నవంబర్-డిసెంబర్ 2025 - 3 వన్డేలు
*ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, జనవరి 2026, 3 వన్డేలు
*భారత్ వర్సెస్ అఫ్ఘానిస్తాన్, జూన్ 2026, 3 వన్డేలు
*ఇండియా వర్సెస్ వెస్టిండీస్, సెప్టెంబర్ 2026, 3 వన్డేలు
*న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా, అక్టోబర్-నవంబర్ 2026 , 3 వన్డేలు
*భారత్ వర్సెస్ శ్రీలంక, డిసెంబర్ 2026, 3 వన్డేలు

6.4 ఇన్నింగ్స్‌లకు ఒక సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ
విరాట్ కోహ్లీ ఇప్పటివరకు వన్డేల్లో 290 ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో విరాట్ కోహ్లీ పేరు మీద 51 సెంచరీలు ఉన్నాయి. అంటే విరాట్ కోహ్లీ ప్రతి 6.4 ఇన్నింగ్స్‌లకు ఒక సెంచరీ చేశాడు. దీని ప్రకారం 19 సెంచరీలు సాధించాలంటే విరాట్ దాదాపు 120 ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది. విరాట్ కోహ్లీ టెస్టుల నుంచి రిటైర్ కాకపోతే సచిన్ 100 సెంచరీల రికార్డును బద్దలు కొట్టగలడు. కానీ కేవలం వన్డేలు ఆడటం ద్వారా విరాట్ కోహ్లీ సచిన్‌ను అధిగమించడం దాదాపు అసాధ్యం.

Story first published: Wednesday, May 14, 2025, 13:44 [IST]
Other articles published on May 14, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+