For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీకి, రోహిత్ శర్మకు ఉన్న తేడా అదే: వారిద్దరి ఫేట్ అలావుంది మరి..!

Virat Kohli vs Rohit Sharma: Hit-Man Won All Matches Toss Whereas Kohli Couldnt

కోల్‌కత: భారత క్రికెట్ జట్టు టీ20 ఫార్మట్‌లో అద్భుతాలను ఆవిష్కరించింది. సరికొత్త టీమిండియా అభిమానుల కళ్ల ముందు ఆవిష్కృతమైంది. బలమైన న్యూజిలాండ్ జట్టును వరుసగా మూడు మ్యాచ్‌లల్లో మట్టికరిపించడం అంటే మాటలు కాదు. అలాంటి పనిని అలవోకగా పూర్తి చేసిందీ యంగ్ ఇండియా టీమ్. అంతర్జాతీయ క్రికెట్ ఆడిన అనుభవం పెద్దగా లేని ప్లేయర్లు జట్టులో ఉన్నప్పటికీ.. విజయంపై ఎలాంటి అనుమానాలు కలగలేదు.

కొత్త కొత్తగా సరికొత్త విజయాలు..

యంగ్‌స్టర్స్ రాక.. టీ20 ఫార్మట్‌ దూకుడుకు మరింత పదును పెట్టింది. దూకుడును పెంచింది. కొత్త కేప్టెన్.. కొత్త కోచ్..వెంకటేష్ అయ్యర్, ఇషాన్ కిషన్, హర్షల్ పటేల్, సూర్యకుమార్ యాదవ్ వంటి కుర్రాళ్లతో నిండిన యంగ్ టీమిండియా.. తన సత్తాను చాటుకుంది. పూర్తిస్థాయి కేప్టెన్‌గా రోహిత్ శర్మ, హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రవిడ్‌కు ఇదే తొలి సిరీస్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగిన టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఎదురైన అవమానకర పరాజయాన్ని మరిపించేలా చేసింది. న్యూజిలాండ్ వంటి బలమైన జట్టుపై మూడుకు మూడు టీ20 మ్యాచ్‌లను గెలిచింది.

హ్యాట్రిక్ టాస్ విన్నింగ్.. హ్యాట్రిక్ మ్యాచ్ విన్నింగ్..

ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. మూడు మ్యాచ్‌లల్లో విజయఢంకా మోగించడమే కాదు.. మూడుసార్లూ టాస్‌ను గెలిచాడు. జైపూర్, రాంచీలతో పాటు కోల్‌కత మ్యాచ్‌లోనూ టాస్ రోహిత్ శర్మనే వరించింది. ఇదో రికార్డు. వరుసగా మూడుసార్లు టాస్ గెలవడం, ఆ గెలవడం.. ఆ మ్యాచ్‌లన్నింట్లోనూ టీమిండియా విజయాన్ని అందుకోవడం రికార్డే. టాస్ అండ్ మ్యాచ్ విన్నింగ్ రేషియో అనేది రోహిత్ శర్మ ఖాతాలో 100 శాతంగా రికార్డయింది. ఇలా రోహిత్ శర్మను టాస్ వరించే అదృష్టం ఇక మున్ముందు ఉండకపోవచ్చు.

విరాట్ వల్ల సాధ్యం కాలేదు..

టీమిండియా టీ20 ఫార్మట్ మాజీ కేప్టెన్ విరాట్ కోహ్లీ వల్ల ఇది సాధ్యమే కాలేదు. విరాట్ కోహ్లీ కేప్టెన్‌గా టాస్ గెలిచిన మ్యాచ్‌ల సంఖ్య తక్కువే. టాస్ గెలవడానికి మొహం వాచిన మ్యాచ్‌లు అనేకం. విరాట్ కోహ్లీ టాస్ ఓడిపోవడం ఖాయమంటూ ఇదివరకు సోషల్ మీడియాలో మెమెలు కూడా వెల్లువెత్తిన సందర్భాలు చాలా ఉన్నాయి. టాస్‌ను గెలిచే అదృష్టం విరాట్ కోహ్లీకి పరిమితంగానే దక్కింది.

రోహిత్ సక్సెస్ రేట్ 81 శాతం

టీ20 ఫార్మట్‌లో కేప్టెన్‌గా రోహిత్ శర్మ అందుకున్న విజయాల పర్సంటేజ్ చాలా ఎక్కువ. రికార్డు స్థాయిలో ఆ రేషియోను నమోదు చేసుకున్నాడు హిట్ మ్యాన్. అతని కేప్టెన్సీలో టీమిండియా ఇప్పటిదాకా 22 టీ20 మ్యాచ్‌లను ఆడింది. అందులో 18 మ్యాచ్‌లను గెలిచిందంటే అతని శక్తి సామర్థ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. నాలుగు మ్యాచ్‌లల్లో మాత్రమే ఓడింది రోహిత్ సారథ్యంలోని భారత జట్టు.

రోహిత్ కేప్టెన్సీలో అత్యధిక మ్యాచ్‌లల్లో..

రోహిత్ కేప్టెన్సీలో అత్యధికంగా హార్దిక్ పాండ్యా ఏడు టీ20 మ్యాచ్‌లను ఆడాడు. అతని తరువాత రెండో స్థానంలో జస్‌ప్రీత్ బుమ్రా నిలిచాడు. ఆరు మ్యాచ్‌లల్లో బుమ్రా ఆడాడు. పూర్తిస్థాయి కేప్టెన్‌గా బాధ్యతలను చేపట్టిన ఈ సిరీస్‌లో వారిద్దరూ లేకపోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హార్దిక్ పాండ్యా గానీ, జస్‌ప్రీత్ బుమ్రాలకు రోహిత్ శర్మ కేప్టెన్సీ కొత్తేమీ కాదు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్‌లో రోహిత్ నాయకత్వాన్ని వహిస్తోన్న ముంబై ఇండియన్స్‌ టీమ్‌లో వారిద్దరూ సభ్యులు.

Story first published: Monday, November 22, 2021, 10:05 [IST]
Other articles published on Nov 22, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+